Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బియ్యం, పిండి, ఇతర పదార్థాలకు పురుగులు పట్టకుండా ఉండాలనే మార్కెట్లో దొరికే రసాయన మందులు అవసరం లేదు. మన వంటింట్లో దొరికే సహజసిద్ధ పదార్థాలతో వాటిని తరిమికొట్టవచ్చు. ఆ చిట్కాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఇంట్లో బియ్యం, పప్పుగింజలు, మసాలాలు నిల్వ ఉంటే.. ముందుగా డబ్బాలను శుభ్రం చేయాలి. బాగా కడిగి ఎండలో ఆరబెట్టాలి. బాగా ఆరిపోయాక అందులో గింజలతో పాటు వేప ఆకులను వేయాలి. నిల్వ ఉంచిన గింజల్లో వేప ఆకులను ఉంచడం వల్ల పురుగులు పెరగవు. ధాన్యంలో ఒకవేళ పురుగులు అప్పటికే ఉంటే అవి కూడా చనిపోతాయి.
నిల్వ చేసిన పిండిలో ఎండు మిర్చి వాడితే పురుగులు, కీటకాల సమస్య ఉండదు. పిండిలోకి కీటకాలు రాకుండా ఎండు మిర్చిలను మధ్యలో అక్కడక్కడా ఉంచాలి. పిండి కూడా చెడిపోదు. కావాలంటే పిండిలో ఉప్పు కూడా వేసి ఉంచుకోవచ్చు. ఇలా చేస్తే పిండి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.