Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యోగం చేసేవారు చాలామంది షిఫ్టులు వైజ్‌గా చేస్తుంటారు. అయితే కొంతమందికి ఎప్పుడు ఓకే షిఫ్టుల్లో పని చేస్తుంటే కొంతమంది మాత్రం ప్రతిరోజు వేరే వేరే షిఫ్టులు వెళ్లాల్సి ఉంటుంది. వారానికి ఒక షిఫ్ట్ చేంజ్ చేస్తూ ఉంటారు కంపెనీ యాజమాన్యం. అయితే షిఫ్ట్‌లలో డ్యూటీలు చేయడం ద్వారా ఎంతో సమయం మిగులుతుందని అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా నైట్ షిఫ్ట్ వెళ్లిన వాళ్ళందరూ.. పగలంతా తమకు ఎంతో కాళీ టైం దొరుకుతుంది అని ఏదైనా పని చేసుకోవచ్చు అనుకుంటారు. ప్రస్తుతం నైట్ షిఫ్ట్‌లు చేస్తున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. అయితే తరచూ నైట్ డ్యూటీలు చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
రాత్రివేళ డ్యూటీలో నిర్వహించే వారితోపాటు వారానికొకసారైనా షిఫ్టుల్లో పని చేసేవారిలో జీవన గడియారం గాడి తప్పి గుండె సమస్యలు డయాబెటిస్ వంటి వంటివి దాడి చేసే ప్రమాదం ఉంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికాలోని టారో వర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. నైట్ షిఫ్ట్‌లో పనిచేసే వారికి నిద్రలేమి కారణంగా.. జీవన గడియారం గాడి తప్పుతుంది అంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
దీని ఫలితంగా జీవక్రియలు మందగిస్తాయి అని పరిశోధనల్లో వెల్లడైంది. ముఖ్యంగా బిపి, షుగర్ భారీగా పెరిగిపోతుండడంతో పాటు పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయే అవకాశం కూడా ఉంది అంటూ ఈ అధ్యయనంలో వెల్లడైనట్లు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం కొనసాగితే... మరెన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జీర్ణ వ్యవస్థ దెబ్బ తినడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.
నైట్ డ్యూటీలు వెళ్లే వారు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి. ముందుగా పగటి పూట కనీసం 6 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. కచ్చితం లెక్క పెట్టుకోండి ఎంత సేపు నిద్రపోతున్నామో. ప్రతిరోజూ తగిన వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యలు చెబుతున్నారు. కాసేపు వ్యాయామం చేస్తే మీ నైట్ డ్యూటీ దుష్ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా శరీరం నైట్ డ్యూటీ వల్ల ఎదురయ్యే సమస్యల నుంచి బయట పడొచ్చు. ముఖ్యంగా మంచి ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం క్రమం తప్పకుండా చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి.