Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రాచీన కాలం నుండి భారతదేశం సైన్స్, గణిత రంగానికి గొప్ప కృషికి ప్రసిద్ధి చెందింది. నిజానికి 'సున్నా' అనే భావనను సంఖ్య, దశాంశ వ్యవస్థగా భారతదేశంలోని అద్భుతమైన గణిత శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. మన దేశం గొప్ప చరిత్రకు, దేశానికి అపారమైన గర్వాన్ని తెచ్చిన అనేక మంది గొప్ప శాస్త్రవేత్తలతో నిండి ఉంది. వారిలో అనేక మంది మహిళా శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. వీరందరూ సైన్స్‌లోని వివిధ విభాగాలకు గణనీయమైన కృషి చేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో తమదైన ముద్ర వేయాలని ఆకాంక్షించే అమ్మాయిలందరికీ వారి జీవితాలు ఆదర్శం. ఈరోజు జాతీయ సైన్స్ డే సందర్భంగా ఆ గొప్ప భారతీయ మహిళా శాస్త్రవేత్తలలో కొందరిని చూద్దాం.
ఆనందీబాయి గోపాలరావు జోషి (1865 - 1887)
జోషి యునైటెడ్ స్టేట్స్లో వెస్ట్రన్ మెడిసిన్‌లో రెండేండ్ల డిగ్రీని పూర్తి చేసిన మొదటి భారతీయ మహిళా వైద్యురాలు. ఆమె వ్యక్తిగత జీవితం ఆమెను మెడిసిన్ తీసుకునేలా చేసింది. ఆమెకు తొమ్మిదేండ్ల వయసులో తన కంటే 20 ఏండ్ల పెద్దవాడైన వ్యక్తితో వివాహం జరిగింది. జోషి 14 సంవత్సరాల వయసులో ఒక కుమారుడికి జన్మనిచ్చింది. తగినంత వైద్య సదుపాయాలు లేకపోవడంతో ఆ బాబు వెంటనే మరణించాడు. తన నవజాత శిశువు మరణం ఆమెను వైద్యురాలు కావడానికి ప్రేరేపించింది. విదేశాల్లో మెడిసిన్ చదవమని భర్త ప్రోత్సహించాడు. 1886లో ఉమెన్స్ మెడికల్ కాలేజీ ఆఫ్ పెన్సిల్వేనియాలో చదువుకుంది. ఒక మహిళ అక్కడ వైద్య విద్యను అభ్యసించడం అనేది ప్రపంచవ్యాప్తంగానే ఇది మొదటి సారి.
జానకి అమ్మాళ్ (1897 - 1984)
1977లో పద్మశ్రీ అవార్డును అందుకున్న మొదటి భారతీయ శాస్త్రవేత్త అమ్మాల్. ఆమె బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్‌గా ప్రసిద్ధి చెందిన బాధ్యతలను నిర్వర్తించారు. 1900లలో అమ్మల్ వృక్షశాస్త్రాన్ని చేపట్టారు. ఇది మహిళలకు అసాధారణమైన ఎంపిక. ఆమె 1921లో ప్రెసిడెన్సీ కాలేజ్ నుండి వృక్షశాస్త్రంలో ఆనర్స్ డిగ్రీని పొందారు. ఆ తర్వాత సైటోజెనెటిక్స్‌లో శాస్త్రీయ పరిశోధనను కొనసాగించారు. ఇది క్రోమోజోమ్‌లు కణ ప్రవర్తన, ఫైటోజియోగ్రఫీకి ఎలా సంబంధం కలిగి ఉంటాయనే దానితో సంబంధం ఉన్న జన్యుశాస్త్ర విభాగ మొక్కల జాతుల భౌగోళిక పంపిణీకి సంబంధించినది. చెరుకు, వంకాయ వంగడాలపై అమ్మాళ్ చేసిన కృషికి మంచి గుర్తింపు వచ్చింది.
కమలా సోహోనీ (1912 - 1998)
సైంటిఫిక్ విభాగంలో పీహెచ్డీ పట్టా పొందిన తొలి భారతీయ మహిళ సోహోనీ. రీసెర్చ్ ఫెలోషిప్ కోసం ఆమె ××ూషకి దరఖాస్తు చేసింది. అయితే ఆమె ఒక మహిళ అయినందున మొదట్లో తిరస్కరణకు గురయ్యారు. అప్పటి ××ూష డైరెక్టర్‌గా ఉన్న ప్రొఫెసర్ సివి రామన్‌కి ఆమె మొదటి విద్యార్థిని. కమలలోని అద్భుతమైన నైపుణ్యం కారణంగా రామన్ ఆమెకు తదుపరి పరిశోధనను కొనసాగించడానికి అనుమతి ఇచ్చారు. మొక్కల కణజాలంలోని ప్రతి కణం అన్ని మొక్కల కణాల ఆక్సీకరణలో పాల్గొనే 'సైటోక్రోమ్ సి' అనే ఎంజైమ్‌ని కలిగి ఉందని ఆమె కనుగొన్నారు.
అసిమా ఛటర్జీ (1917 - 2006)
అసిమా ఒక భారతీయ రసాయన శాస్త్రవేత్త. ఆమె ఆర్గానిక్ కెమిస్ట్రీ మరియు ఫైటోకెమిస్ట్రీ (మొక్కల నుండి తీసుకోబడిన రసాయనాలు) రంగాలలో చేసిన కృషికి అత్యంత గౌరవం పొందారు. 1936లో కలకత్తా విశ్వవిద్యాలయంలోని స్కాటిష్ చర్చ్ కాలేజ్ నుండి రసాయన శాస్త్రంలో పట్టభద్రురాలయ్యారు. ఆ తర్వాత తన పరిశోధనను కొనసాగించారు. ఆమె అత్యంత ముఖ్యమైన పనిలో వింకా ఆల్కలాయిడ్స్ (క్యాన్సర్-వ్యతిరేక లక్షణాలకు ప్రసిద్ధి చెందిన పెరివింకిల్ నుండి ఉద్భవించింది) అండ్ యాంటీ-ఎపిలెప్టిక్ అండ్ యాంటీ-మలేరియా ఔషధాల అభివృద్ధిపై పరిశోధనలు ఉన్నాయి.
రాజేశ్వరి ఛటర్జీ (1922 - 2010)
కర్నాటక రాష్ట్రానికి చెందిన మొదటి మహిళా ఇంజనీర్ రాజేశ్వరి 1946లో విదేశాల్లో చదువుకోవడానికి ప్రభుత్వ స్కాలర్షిప్ పొందారు. ఆమె మిచిగాన్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు. అక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం నుండి మాస్టర్స్ డిగ్రీని పొందారు. డాక్టరేట్ పట్టా పొందిన తర్వాత ఆమె భారతదేశానికి తిరిగి వచ్చి, ××ూషలోని ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో ఫ్యాకల్టీ మెంబర్‌గా చేరారు. అక్కడ ఆమె తన భర్తతో కలిసి మైక్రోవేవ్ పరిశోధనా ప్రయోగశాలను స్థాపించారు. అక్కడ వారిద్దరు మైక్రోవేవ్ ఇంజనీరింగ్‌లో మార్గదర్శక పని చేసారు.
కల్పనా చావ్లా (1962 - 2003)
అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతికి చెందిన మొదటి వ్యోమగామి కల్పనా చావ్లా. ఆమె మొదటిసారిగా 1997లో ఒక స్పేస్ షటిల్ కొలంబియాలో మిషన్ స్పెషలిస్ట్ అండ్ ప్రైమరీ రోబోటిక్ ఆర్మ్ ఆపరేటర్‌గా ప్రయాణించారు. ఆమె 1982లో యునైటెడ్ స్టేట్స్కు వెళ్లి 1984లో ఆర్లింగ్టన్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందారు. అలాగే 1986లో రెండవ మాస్టర్స్‌ను కొలరాడో బౌల్డర్ విశ్వవిద్యాలయం నుండి, 1988లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీని పొందారు. ఫిబ్రవరి 1, 2003న స్పేస్ షటిల్ కొలంబియా విపత్తులో మరణించిన సిబ్బందిలో చావ్లా ఒకరు. భూమి యొక్క వాతావరణంలోకి తిరిగి వస్తున్న సమయంలో స్పేస్ షటిల్ విచ్ఛిన్నం కావడంతో ఈ విషాదం సంభవించింది.
డాక్టర్ ఇందిరా హిందూజా
బొంబాయి విశ్వవిద్యాలయం నుండి 'హ్యూమన్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్'లో డాక్టరేట్ పట్టా పొందిన డాక్టర్. ఇందిరా హిందూజా ఒక భారతీయ గైనకాలజిస్ట్, ప్రసూతి వైద్యురాలు, వంధ్యత్వ నిపుణురాలు. ఆమె భారతదేశపు మొదటి +×ఖీు పుట్టుకకు దారితీసిన గేమేట్ ఇంట్రాఫాలోపియన్ ట్రాన్స్ఫర్ (+×ఖీు) టెక్నిక్‌ను ప్రారంభించారు. జనవరి 4, 1988న బిడ్డకు జీవం పోశారు. దీనికి ముందు ఆమె ఆగస్టు 6, 1986న ఖజువీ హాస్పిటల్లో భారతదేశపు మొట్టమొదటి టెస్ట్-ట్యూబ్ బేబీని ప్రసవించింది. రుతుక్రమం ఆగిన, అకాల అండాశయ వైఫల్యం ఉన్న రోగుల కోసం ఓసైట్ డొనేషన్ టెక్నిక్‌ను అభివృద్ధి చేసినందుకు కూడా ఆమె మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. జనవరి 24, 1991న ఓ శిశువు ఈ టెక్నిక్ నుండి బయటపడింది.
- సలీమ