Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజువారీ ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలను జోడించడం ద్వారా కండల బలాన్ని పెంచుకోవచ్చని డాక్టర్లు సలహాలిస్తున్నారు. అన్నం: అన్నం ఉడికించడమే కాదు జీర్ణించుకోవడం కూడా చాలా సులభం. ఇతర ఆహార పదార్థాలతో పోలిస్తే ఇది మీ కండరాల బరువు సమర్థవంతంగా పెంచగలదు. దాదాపు 158 గ్రాముల వండిన తెల్ల బియ్యంలో 44 గ్రాముల పిండి పదార్థాలు, 204 కేలరీలు ఉంటాయి. గింజలు: కండల బలం పెంచడంలో గింజలు బాగా పనిచేస్తాయి. దాదాపు 1/4 కప్పు బాదంలో 170 కేలరీలు, 6 గ్రాముల ప్రోటీన్, 4 గ్రాముల ఫైబర్, 15 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. బరువు పెరగడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
మాంసం: మాంసం మీ కండరాలను పటిష్టం చేస్తుంది. ఇందులో ల్యూసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. మాంసంలో ఉండే అమైనో యాసిడ్ కండరాలకు అదనపు బలం చేకూర్చుతుంది.