Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వయసు మీదపడుతుంటే నిస్సాహయత ఆవరించడం సహజం. అప్పటి వరకు కుటుంబం కోసం కష్టపడ్డాము. ఇక ఓపిక ఎక్కడుంది. ఈ వయసులో ఇంకేం చేస్తాము'' అనే మాటలు చాలా మంది నుండి సహజంగా వినిపిస్తాయి. కానీ అర్చనా సోనీ అలాంటి మహిళ కాదు. ఇరవై ఐదేండ్లు తన జీవితాన్ని పూర్తిగా కుటుంబానికి అంకితం చేశారు. పిల్లల్ని పెంచడంలో గడిపేశారు. ప్రస్తుతం యాభై సంవత్సరాల వయసులో వ్యాపారవేత్తగా మారారు. సాంప్రదాయ వంటకాల ఆధారంగా సూపర్‌ఫుడ్ మిశ్రమాలను అందించడానికి ఒక వెల్నెస్ బ్రాండ్‌ను ప్రారంభించారు.
ఢిల్లీలో పుట్టి పెరిగిన అర్చన గణితంలో బిఏ పూర్తి చేశారు. పెండ్లికి ముందు రెస్టారెంట్ వ్యాపారం చేసే తండ్రికి సహాయం చేసేవారు. ఓ డాక్టర్‌తో వివాహం అయిన తర్వాత పానిపట్‌కు వెళ్ళారు. ''నా కుటుంబానికి సాధ్యమైనంత ఉత్తమమైన పోషకాహారాన్ని అందించడం, వారిని ఆరోగ్యంగా ఉంచడం నా బాధ్యత. ఏ వంటకం కావాలో నా పిల్లలు ఎంపిక చేసుకునేవారు. ఆరోగ్య ప్రయోజనాలు రుచి విషయంలో రాజీ పడకూడదని, లేకుంటే పిల్లలు వాటిని తిరస్కరిస్తారని నాకు తెలుసు. ఇదే మా రోజువారీ డైట్లో సులభంగా చేర్చగలిగే సూపర్‌ఫుడ్ మిక్స్‌ల శ్రేణిని రూపొందించేలా చేసింది. వీటిలో ఆరోగ్యంతో పాటు మంచి రుచి కూడా ఉంటుంది'' అని అర్చన చెప్పారు.
అవకాశం కోసం ఎదురు చూస్తున్నా
మూడు సంవత్సరాల పాటు అర్చన ఈ ఉత్పత్తులను స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం ఉచితంగా తయారు చేసి ఇచ్చారు. ''రాను రాను వీటికి డిమాండ్ పెరిగింది. ఉత్పత్తులను అడిగే బంధువులు, స్నేహితుల సంఖ్య రోజురోజుకు పెరిగింది. దాంతో మా అబ్బాయి డాక్టర్ ఉజ్వల్ దానిని ఒక అవకాశంగా భావించి, ఈ ఉత్పత్తులను సరైన మార్గంలో ప్రపంచానికి తీసుకెళ్లాలని సూచించాడు. నేను కూడా దానికి సిద్ధంగా ఉన్నాను. నిజానికి నా జీవితమంతా ఈ అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. అతని మద్దతుతో చివరకు నా వ్యాపారాన్ని ప్రారంభించాను'' ఆమె చెప్పారు.
నా ఉత్సాహం చూసి
2020లో వ్యాపారాన్ని అర్చనా ఫుడ్స్‌గా నమోదు చేసుకున్నారు. ఎలాంటి మార్కెటింగ్ వ్యూహం లేకుండానే మొదటి రెండు నెలల్లోనే రూ. 1.5 లక్షలకు చేరువలో విక్రయాలు సాధించారు. ''ప్రజల నుండి మాకు లభించిన స్పందన, నా ఉత్సాహాన్ని చూసి నా కొడుకు ఉజ్వల్ నాతో పాటు సహ వ్యవస్థాపకుడిగా చేరాడు. మేము డిసెంబర్ 2020లో మా ఉత్పత్తులను అశ్వత పేరుతో తిరిగి ప్రారంభించాము. తిరిగి ప్యాక్ చేసాము. బహుళ మార్కెట్లో అమ్మేందుకు జాబితా తయారు చేసాము. సొంతంగా ణ2జ స్టోర్‌ను నిర్మించాము. ఏప్రిల్ 2021లో అమ్మకాలను ప్రారంభించాము'' అని ఆమె జతచేస్తున్నారు.
ఇంట్లోనే తయారు చేశాం
''మాకు మొదట్లో ఉత్పత్తులను తయారు చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ లేవు. కాబట్టి మేము మా డ్రాయింగ్ రూమ్, బాల్కనీని తయారీ స్థలంగా మార్చాము. మా వద్ద కమర్షియల్ గ్రైండింగ్ మెషీన్లు లేవు. అందుకే ఇంటి మిక్సర్, గ్రైండర్లను ఉపయోగించాము. నా కొడుకు, నేను అశ్వత వారి మేకర్స్, ప్యాకర్స్, కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్‌లు, సోషల్ మీడియా మేనేజర్లు, పెర్ఫార్మెన్స్ మార్కెటర్స్ ఇలా ఎంతో మందిని కలిసి వ్యాపారాన్ని పెంచే కృషి చేశాము'' అంటున్నారు ఆమె.
అట్టడుగు మహిళల కోసం...
అశ్వత ప్రజాదరణ పొందడం ప్రారంభించడంతో సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలను తమ పని కోసం నియమించాలని అర్చన భావించారు. ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేలా వారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం వారు కస్టమర్ సపోర్ట్, మార్కెటింగ్‌ను అందించే మొత్తం మహిళా బృందంతో పాటు తయారీలో నలుగురు మహిళలతో కలిసి పని చేస్తున్నారు.
పురాతన జ్ఞానం ఆధారంగా
అశ్వతతో పురాతన ఆయుర్వేద జ్ఞానం ఆధారంగా స్వచ్ఛమైన, సహజమైన, ప్రామాణికమైన భారతదేశ సూపర్‌ఫుడ్‌లను అందించడం వ్యవస్థాపకుల లక్ష్యం. ముడి పదార్థాలు కేరళ, మేఘాలయ రైతుల నుండి నేరుగా లభిస్తాయి. ముడి సుగంధ ద్రవ్యాలు, మూలికలను హర్యానాలోని పానిపట్‌లో మహిళా ఉద్యోగులు ప్రాసెస్ చేస్తారు. ఉత్పత్తులు వారి సొంత వంటకాల ప్రకారం రూపొందించబడ్డాయి. ప్రస్తుతం అశ్వత మిల్క్ బూస్టర్, అశ్వత చారు మసాలా, అశ్వత పసుపు లట్టే, అశ్వత డిటాక్స్ కధా, అశ్వత హెర్బల్ సబ్జీ మసాలా వంటి ఐదు ఉత్పత్తులను అందిస్తున్నారు. అర్చనా తయారీ వ్యవహారాలు చూసుకుంటే ఆమె కొడుకు ఉజ్వల్ కంపెనీ విక్రయాలు, మార్కెటింగ్, సాంకేతిక అంశాలను చూసుకుంటారు.
సొంత ఇకామర్స్ స్టోర్‌లో
'మహమ్మారి తర్వాత ఆరోగ్యకరమైన, స్పృహతో కూడిన ఆహారపు అలవాట్ల వైపుకు చాలా మంది ప్రజలు మారారు. మేము వారికి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలతో పాటు సంపూర్ణ ఆరోగ్యం కోసం ఇతర ఉత్పత్తులను అందిస్తున్నాము'' అంటున్నారు అర్చన. ణ2జ బ్రాండ్‌గా అశ్వత ఉత్పత్తులు దాని సొంత ఇకామర్స్ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి అలాగే Aఎaఓశీఅ ూaబఅషష్ట్రజూaస, ఖీశ్రీఱజూసaత్‌ీ, దీఱస్త్రbaరసవ్, ణతీఱఅసరణవశ్రీఱ, ఉఅవ+తీవవఅ మొదలైన అన్ని ప్రధాన మార్కెట్‌ప్లేస్‌లలో ఈ ఉత్పత్తులు జాబితా చేయబడ్డాయి.
సంపూర్ణ ఆరోగ్యం కోసం
''ఆరిక్ లేదా వెల్బీయింగ్ న్యూట్రిషన్ వంటి స్టార్టప్‌లు సప్లిమెంట్లు, ఆయుర్వేద మందులు లేదా కొత్త వర్గాలను సృష్టించడంపై దృష్టి పెడతాయి. మా దృష్టి రోజువారీ ప్రధానమైన వాటిపై ఉంటుంది. ఉదాహరణకు చారు మసాలా లేదా మిల్క్ డ్రింక్ మిక్స్‌లు. ప్రజలు ఇప్పటికే ఏమి ఇష్టపడుతున్నారో మాకు తెలుసు. ఆ ఉత్పత్తులను సాధ్యమైనంత ఉత్తమమైన పదార్థాలతో, అత్యంత సహజమైన రూపంలో తయారు చేస్తాము. సంపూర్ణ ఆరోగ్యం కోసం ఆయుర్వేద మూలికలతో వాటిని బలపరుస్తాము. ప్రస్తుతానికి వ్యూహం చాలా సులభం. గరిష్ట సంఖ్యలో కస్టమర్లను చేరుకోవడానికి అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన మార్గంలో అత్యుత్తమ నాణ్యత గల ఉత్పత్తులను తయారు చేస్తున్నాము'' అని ఆమె చెప్పారు.
ఎనభై లక్షలకు పెంచాలి
అశ్వత ఈకామర్స్ స్టోర్, తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి వ్యవస్థాపకులు ఈ కంపెనీని రూ. 5 లక్షలతో బూట్‌స్ట్రాప్ చేశారు. ఇది గత ఏడాది ఏప్రిల్‌లో కార్యకలాపాలు ప్రారంభించి, డిసెంబర్ 2021లో దాదాపు రూ. 30 లక్షల ఆదాయాన్ని ముగించింది. ఈ ఏడాది కంపెనీ రూ. 80 లక్షల ఆదాయాన్ని పొందాలని భావిస్తోంది. ''మేము ప్రతిదానిని తిరిగి మూల్యాంకనం చేయవలసి వచ్చింది. జట్టులో ఎక్కువ మంది వ్యక్తులను నెమ్మదిగా చేర్చుకోవడానికి చిన్న చిన్న చర్యలు తీసుకోవాలి. వ్యక్తులు మా ఉత్పత్తుల నాణ్యతను ఎంతగా మెచ్చుకున్నారో తెలియజేస్తూ వారి సమీక్షలను వ్యక్తిగతంగా టెక్స్ట్ చేయడానికి/ఇమెయిల్ చేయడానికి సమయం కేటాయించడం మా అతిపెద్ద విజయం. ఇవి అతి తక్కువ సమయంలో కూడా కొనసాగడానికి మాకు సహాయపడ్డాయి'' ఆమె చెప్పారు.
అశ్వత ఉనికిని పెంచాలని
ముందుకు వెళుతున్న కొద్ది మరిన్ని ఆఫ్‌లైన్, ఆన్లైన్ ఛానెల్‌లలో అశ్వత ఉనికిని పెంచాలని వ్యవస్థాపకులు ప్లాన్ చేస్తున్నారు. ''మేము చాలా శీఘ్ర వృద్ధి కోసం నిధులను సేకరించడానికి ప్రయత్నిస్తున్న పెట్టుబడిదారులతో సన్నిహితంగా ఉన్నాము. అలాగే సంపూర్ణ ఆరోగ్యం కోసం అనేక ఇతర ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నాము'' అని అర్చన జతచేస్తున్నారు.