Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పౌష్టి కాహారం శరీరానికి మాత్రమే కాదు మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. మీ వంటగదిలో ఐదు పోషకాలు, రుచికరమైన ఆహారాలు అందుబాటులో ఉంటాయి. అవేంటో చూద్దాం...
బెల్లం: బెల్లంలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్‌ను కలిగి ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, బెల్లం మొత్తం శరీరాన్ని, ముఖ్యంగా కాలేయం, రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
రాగులు: ఇందులో ప్రోటీన్ అధికంగా ఉండటమే కాకుండా విటమిన్లు సి, బి-కాంప్లెక్స్, ఇ, ఐరన్, కాల్షియం వంటి పోషకాలతో నిండి ఉంటాయి. ఇది జుట్టు, చర్మానికి మేలు చేస్తుంది. నరాలను రిలాక్స్ చేయడంలో సహాయపడుతుంది. సహజంగా నిద్రను ప్రేరేపిస్తుంది.
కొబ్బరి: పోషకాలతో నిండిన కొబ్బరి నీరు, పచ్చి కొబ్బరి, పాలు లేదా దాని నూనెను కూడా తీసుకోవచ్చు. మాంగనీస్ నుండి మెగ్నీషియం వరకు రాగి నుండి పొటాషియం వరకు కొబ్బరి నుండి లభిస్తాయి. కొబ్బరి నీరు ఆందోళనను తగ్గిస్తుంది. కొబ్బరి నీరు యాంటిడిప్రెసెంట్ ప్రభావాన్ని కలిగి ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.
ఖర్జూరం: వీటిలో పొటాషియం, ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లతో సహా పోషకాలు ఉన్నాయి. ఖర్జూరంలో ఫైబర్ అధికంగా ఉంటుంది.