Authorization
Mon Jan 19, 2015 06:51 pm
21 ఏండ్ల ప్రియదర్శిని... చెన్నై యువ కౌన్సిలర్‌గా చరిత్ర సృష్టించారు. విద్యార్థి దశ నుండే ఉద్యమాల్లో పాల్గొని విద్యార్థుల సమస్యలపై చురుగ్గా పని చేసేవారు. అప్పుడే కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్స్కిస్టు) రాజకీయాల పట్ల ఆకర్షితురాలయ్యారు. ఇటీవల చైన్నె నగరంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో విజయం సాధించి కౌన్సిలర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె గురించి కొన్ని వివరాలు.
ప్రియదర్శిని ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుండి వచ్చారు. ఆమె తండ్రి ఒక ఆమె వయసు కేవలం 21 సంవత్సరాలు. సీపీఎంలో సాధారణ సభ్యుడుగా ఉన్నారు. అలాంటి కుటుంబం నుండి వచ్చిన ప్రియదర్శిని చెన్నై నగర కౌన్సిల్ సభ్యులలో అత్యంత చిన్న కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు.
సీపీఎంకి ప్రాతినిథ్యం
మహిళా అభ్యర్థుల కోసం కేటాయించిన 50 వార్డులలో ఒకటైన చెన్నైలోని తేనాంపేటలోని 98వ వార్డు నుంచి ఆమె పోటీ చేశారు. ఆమె ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె), కాంగ్రెస్, దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (డిఎండికె), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయుఎంఎల్), ఇతరులతో కూటమిలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)కి ప్రాతినిధ్యం వహించారు.
విద్యార్థి దశ నుండే...
ప్రియదర్శిని కాలేజీలో చదివే రోజుల్లో విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేవారు. అక్కడ ఆమె స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్.ఎఫ్.ఐ విద్యార్థి విభాగం) లో చేరారు. తర్వాత ఆమె యువజన విభాగమైన డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డివైఎఫ్ఐ)లో చేరారు.
తండ్రి ఆనందించాడు
రెండు దశాబ్దాలకు పైగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) పార్టీ సభ్యుడిగా ఉన్న ఆమె తండ్రి కూడా తన కుమార్తెకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టిక్కెట్టు ఇవ్వడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రియదర్శిని 5,253 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
సేవ చేయడం ఇష్టం
ప్రియదర్శిని ఎన్నికల్లో పోటీ చేయమని కోరినప్పుడు గతంలోనే ఆమె సీపీఎం తరపున ఎన్నోసార్లు ఎన్నికల ప్రచారాలు, ర్యాలీల్లో పాల్గొన్ని ఉన్నారు. కాబట్టి ఇదేమీ ఆమెకు పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు. ''ప్రజాసేవ చేయడం నాకు అలవాటు. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి అదే పని చేయడం చూశాను. ఫలితంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. నేను చాలా కాలం నుండి చేస్తున్న నా ప్రజాసేవకు ఇది కొనసాగింపు మాత్రమే'' అని యువ కౌన్సిలర్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
ప్రజలు నమ్మకంగా ఉన్నారు
స్థానిక ప్రజలకు అత్యుత్తమ పౌర సదుపాయాలు కల్పిస్తామని ప్రియదర్శిని హామీ ఇచ్చారు. ప్రియదర్శిని గెలవడంతో గత కొంత కాలంగా టేనాంపేట ప్రజలు పడుతున్న నీటి కష్టాలకు దీర్ఘకాలిక పరిష్కారం లభిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఆమె వార్డులోని ప్రజలు కూడా ప్రియదర్శిని సమాజానికి చేస్తున్న సేవల పట్ల ఆశాజనకంగా ఉన్నారు.