Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఊబకాయం, ఒబేసిటి చాప కింద నీరులా ''సైలెంట్ కిల్లర్''గా మారుతోంది. క్యాన్సర్, మధుమేహం, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు గుండె జబ్బుల వంటి తీవ్రమైన వ్యాధులకు ఊబకాయం కారణమవుతూ ప్రజలను మరింత ప్రమాదపుటంచులకు తీసుకువెళ్తున్నాయి. ఈ పరిస్థితుల నుంచి ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యపర్చేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్చి 4న ''వరల్డ్ ఒబేసిటీ డే''ను ప్రకటించడంతో పాటు ఈ సంవత్సరం 'ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాలనే' థీంను ప్రకటించింది.
ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ప్రజారోగ్య సవాళ్లలో ఊబకాయం ఒకటిగా చెప్పవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా 800 మిలియన్ల మంది ఊబకాయం బారిన పడగా మిలియన్ల మంది ప్రమాదపుటంచున ఉన్నారు. ఇది జీవితాలను మార్చే వ్యాధి. కోవిడ్ -19 పరిస్థితుల్లో హాస్పిటల్లో చేరే పరిస్థితిని రెట్టింపు చేసింది. ఊబకాయంతో బాధపడే వారు పనిచేసే చోట, ఇంట్లో ఇబ్బందులతో పాటు రోజు వారి కార్యక్రమాల్లో మద్దతు లేకపోవడంతో పాటు సమాజంలో చిన్న చూపును ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులు మారాలంటే గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో పాటు జాతీయ స్థాయిలో చర్యలు అవసరం. ప్రస్తుతం మనం జీవనం కొనసాగిస్తున్న అనేక పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, వాతావరణం, జీవనశైలి వంటి నాటకీయ పరిస్థితులు ఊబకాయానికి ఆధ్యంపొస్తున్నాయి.
మన దేశంలో 185 మిలియన్ల మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితులు పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం ఆందోళన కలిగిస్తున్న అంశంగా చెప్పవచ్చు. బేరియాట్రిక్ సర్జరీ ద్వారా బరువు తగ్గడమే కాకుండా శరీరంలో మెటబాలిక్ సిండ్రోమ్ మెరుగుపడుతుంది. టైప్-2 డయాబెటీస్ 80శాతం, బీపీ (హైపర్టెన్షన్) 70శాతం తగ్గుతుంది. కొలెస్ట్రాల్ స్థాయి సాధారణస్థితికి వస్తుంది. మహిళలు వారి బరువు తగ్గడం వల్ల సంతానోత్పత్తి తిరిగి మెరుగుపడుతుంది. బరువు తగ్గడం వల్ల ఇతర అనేక లాభాలున్నాయి. ఊబకాయంతో బాధపడేవారికి బేరియాట్రిక్ శస్త్రచికిత్స సురక్షితమైనదిగా చెప్పవచ్చు.
బేరియాట్రిక్ సర్జరీ కాలానుగుణంగా ఆధునిక సాంకేతికతతో అభివృద్ది చెందింది. ఉత్తమ శిక్షణ పొందిన శస్త్రచికిత్సా నిపుణుల పర్యవేక్షణ, నైపుణ్యం కలిగిన అనస్థీషియా సిబ్బంది, ఉత్తమ సెంటర్లతో పాటు సహాయక సిబ్బంది సేవల వల్ల శస్త్రచికిత్సల వల్ల 1శాతం కంటే తక్కువ రిస్క్ మాత్రమే ఉందని చెప్పవచ్చు. శస్త్రచికిత్స తర్వాత ప్రతి వ్యక్తి రోజుల్లోనే కోలుకోవడంతో పాటు రోజు వారి జీవితం ఎంతో మెరుగుపడుతుంది.
బేరియాట్రిక్ శస్త్రచికిత్స కోసం సెంటర్ను ఎంచుకునేటప్పుడు సర్జన్ ఎక్స్పీరియన్స్, అనస్థీషియా టీం, సపోర్టివ్ మెడికల్ స్పెషలిస్టుల అనుభవం, ఆపరేషన్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, సలహాలు, సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఓబేసిటీ సపోర్ట్ గ్రూప్, న్యూట్రిషన్, ఫిజియోథెరఫి, నర్సింగ్ టీం బృందం కలిగి ఉన్న సెంటర్ను ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం.
వరల్డ్ ఓబేసిటీ డే సందర్భంగా...
- డాక్టర్. కె.ఎస్. లక్ష్మి
సీనియర్ సర్జికల్
గాస్ట్రో ఎంటిరాలజిస్ట్ డ బేరియాట్రిక్ సర్జన్
యశోద హాస్పిటల్స్
78930 53355, 88971 96669