Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అధిక బరువు తగ్గాలనుకొనే వారు సరైన ప్రణాళికతో వాకింగ్ చేయాలే గాని దానికి సుమారుగా 500 గ్రాముల నుంచి 1.5 కిలోల వరకు బరువు తగ్గవచ్చు. అదెలా అంటే... సోమవారం 20 నిమిషాల పాటు నెమ్మదిగా వాకింగ్ చేయాలి. తర్వాత పదిహేను నిమిషాలపాటు ఒక మోస్తరు వేగంతో వాకింగ్ చేయాలి. ఇలా మళ్ళీ ఐదు నిమిషాలు నెమ్మదిగా వాకింగ్ చేయాలి. మంగళవారం రోజు పది నిమిషాలు నెమ్మదిగా వాకింగ్ తరువాత 20 నిమిషాలు మోస్తారు వేగవంతమైన వాకింగ్ అలాగే ఐదు నిమిషాలు నెమ్మది వాకింగ్. మరుసటి రోజున విశ్రాంతి తీసుకోవాలి. 20 నిమిషాల పాటు నెమ్మదిగా నడవాలి. తర్వాత 15 నిమిషాలు మోస్తారు వాకింగ్ తర్వాత నిమిషాలు నెమ్మది నడక చేయాలి. శుక్రవారం పది నిమిషాలు నెమ్మదిగా వాకింగ్ 20 నిమిషాలు మోస్తారు వాకింగ్ 20 నిమిషాల వేగవంతమైన వాకింగ్. శనివారం ఐదు నిమిషాలు నెమ్మదిగా నడక 5 నిమిషాలు మోస్తారు వాకింగ్ 25 నిమిషాలు వేగమైన వాకింగ్ తరువాత ఐదు నిమిషాలు నెమ్మదిగా వాకింగ్. ఆదివారం రోజున విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత రెండో వారంలో సోమవారం 10 నిమిషాలు మోస్తరు వాకింగ్, 2 నిమిషాలు వేగమైన వాకింగ్, పది నిమిషాలు మోస్తరు వాకింగ్ ఐదు నిమిషాలు నెమ్మదిగా నడక. మంగళవారం ఐదు నిమిషాలు మోస్తరు వాకింగ్ ముప్పై ఐదు నిమిషాలు మోస్తారు, వేగవంతమైన నడక తర్వాత ఐదు నిమిషాలు నిమ్మదిగా వాకింగ్ చేయాలి. బుధవారం రోజున విశ్రాంతి తీసుకోవాలి. గురువారం 10 నిమిషాలు మోస్తారు వాకింగ్, 30 నిమిషాలు వేగమైన వాకింగ్ పది నిమిషాలు మోస్తరు వాకింగ్ ఐదు నిమిషాలు నెమ్మదిగా నడక. శుక్రవారం 5 నిమిషాలు మోస్తరు వాకింగ్, 35 నిమిషాలు మోస్తరు వాకింగ్, వేగవంతమైన వాకింగ్ ఐదు నిమిషాలు నెమ్మదిగా వాకింగ్ చేయాలి. ఇలా చేస్తే మీ బరువు అదుపులో ఉంటుంది.