Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే వీటిని సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. బాదం, జీడిపప్పుతో పాటు పిస్తా పప్పు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యగా మెదడుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాదు చర్మ సమస్యలను తొలగిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పిస్తా మెదడుకు సంబంధించిన అనేక సమస్యలను తొలగించడంతో పాటు మానసిక సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పిస్తాలో మెదడు ఆరోగ్యానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, విటమిన్-ఎ, కె, సి, బి-6, విటమిన్ ఇ, ప్రోటీన్, కాల్షియం, మాంగనీస్, ఫోలేట్ ఉన్నాయి. పిస్తాపప్పులను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, నేర్చుకునే సామర్థ్యం వృద్ధి చెందుతాయి. తలనొప్పి, వాపు, మంట సమస్యను తగ్గించడంలో కూడా ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. రాత్రిపూట పాలతో పిస్తా తింటే నిద్ర బాగా పడుతుంది. బీపీ రక్తపోటు అదుపులో ఉంటుంది. అన్నింటికీ మించి.. పిస్తా పప్పు తింటే మీరు రోజంతా తాజాగా, రిలాక్స్‌గా ఉంటారు.
విటమిన్ ఎ: పిస్తాలు మెదడుకు, కండ్లకు చాలా మేలు చేస్తాయి. ఇందులో ఉండే విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు, ల్యూటిన్, జియాక్సంతిన్ సహాయంతో కండ్లు, మెదడు నరాలు రిలాక్స్ అవుతాయి.
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు: పిస్తాలు మెదడు ఏకాగ్రత, సామర్థ్యాన్ని పెంచుతాయి. జ్ఞాపకశక్తి, అభ్యాస నైపుణ్యాలను పెంచడంలో దోహదపడతాయి. ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే వాపు, నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
విటమిన్ బి6: పిస్తాలో ఉండే విటమిన్ బి6 డోపమైన్ తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. డోపమైన్ అనేది ఏకాగ్రతకు సహాయపడే న్యూరోట్రాన్స్మిటర్. వృద్ధాప్యంలో మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తి పెరగడం, అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.
ప్రోటీన్: ప్రోటీన్ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. కొత్త కణాల ఏర్పాటుకు కూడా సహాయపడుతుంది.
పిస్తాను ఎలా తినాలి?: పిస్తాపై ఉండే పొట్టు తీసి ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం తినాలి. నేరుగా తినడం ఇష్టం లేకుంటే.. స్వీట్లు, ఇతర ఆహార పదార్థాలపై గార్నిష్ చేసి కూడా తీసుకోవచ్చు. రాత్రిళ్లు నీటిలో నానబెట్టి ఉదయం తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి: మీకు బీపీ ఎక్కుగా ఉన్నట్టయితే వేయించిన పిస్తాలను తినవద్దు. మధుమేహ వ్యాధిగ్రస్తులు పిస్తా పప్పులను చాలా పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. పిస్తాను ఎక్కువగా తీసుకోవడం వల్ల డయేరియా సమస్యలు వచ్చే అవకాశముంది. పిస్తాను అధికంగా తీసుకుంటే కొందరిలో అలర్జీ వస్తుంది. చర్మంపై దద్దుర్లు, దురద కలుగుతాయి.
ఇట్ల చేద్దాం
అల్లంలో చాలా మురికి ఉంటుంది. దానిని శుభ్రం చేయడం, తొక్క తీయడం చాలా సమయం తీసుకుంటుంది. అందుకే అల్లాన్ని నీటిలో 2-3 గంటలు నానబెట్టి శుభ్రం చేస్తే మట్టి లేకుండా సులభంగా తొక్కవచ్చేస్తుంది.