Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్యాస్ ధరలు చుక్కలను తాకుతున్న విషయం తెలిసిందే. అయితే గ్యాస్‌ను ఆదా చేయడం ద్వారా ఆ ఖర్చును కొద్ది మేర తగ్గించుకోవచ్చు. గ్యాస్‌ను సేవ్ చేయడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం...
కుదిరినప్పుడల్లా గ్యాస్ సిలిండర్‌కు బదులుగా అవసరమైతే మైక్రోవేవ్‌ను వేడి చేయడానికి ఉపయోగించండి.
- భోజనంలో సలాడ్లు, పండ్లను జోడించండి ఎందుకంటే వాటికి గ్యాస్ అవసరం లేదు.
- వంట పాత్రలు తడిగా ఉన్నప్పుడు నేరుగా స్టవ్ మీద పెట్టకండి. అలా ఉంటే వేడి కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. పాత్రలో నీటి చుక్కలు ఉన్నప్పుడు ముందుగా వాటిని ఏదైనా గుడ్డతో తుడవండి.
- గ్యాస్ బర్నర్ సరిగ్గా శుభ్రం చేయకపోతే గ్యాస్ వృథా అవుతుంది. అందుకే ఎప్పటికప్పుడు గ్యాస్ బర్నర్‌ను శుభ్రం చేయండి.
- ఫ్రిజ్‌లోని ఆహార పదార్థాలను నేరుగా గ్యాస్‌పై ఉంచవద్దు. కాసేపు గది ఉష్ణోగ్రతలో ఉంచిన తర్వాత వాటిని వేడి చేయండి.
- వంట చేసేటప్పుడు ప్రెషర్ కుక్కర్‌ని ఉపయోగించడం వల్ల గ్యాస్‌ను ఆదా చేసుకోవచ్చు. ఈ ప్రెజర్ కుక్కర్ ఆహారాన్ని వేగంగా ఉడికేలా సహాయపడుతుంది.
- వంట చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన ప్రధాన విషయం ఏమిటంటే తక్కువ మంట మీద ఉడికించడం మంచిది. సిమ్‌లో పెట్టుకోవడం ద్వారా గ్యాస్ ఆదా అవుతుంది.
- వంట చేసేటపుడు పాత్రపై ప్లేట్ పెట్టండి. దీని వల్ల వంట వేగంగా వండుకోవచ్చు.