Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉల్లిగడ్డ నిల్వ చేయడం ప్రతి ఇంట్లో సాధారణ విషయం. ఎందుకంటే ఇది రోజువారీ వంటలలో విస్తృతంగా ఉపయోగిస్తారు. అందుకే ఎక్కువ మొత్తంలో ఉల్లిగడ్డ నిల్వ చేసుకుంటారు. ఉల్లిగడ్డను నిల్వ చేయడానికి అనుసరించాల్సిన కొన్ని సాధారణ చిట్కాలు ఉన్నాయి.
- ఉల్లిగడ్డ నిల్వ చేయడానికి ఉత్తమ మార్గం సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద చల్లని, పొడి, చీకటి ప్రదేశంలో ఉంచడం. పచ్చి పొట్టు తీసిన ఉల్లిగడ్డ వాతావరణ పరిస్థితిని బట్టి రెండు మూడు నెలల వరకు ఉంటాయి. తేమ తక్కువగా ఉండే చిన్నగది లేదా స్టోర్ రూమ్లలో వాటిని నిల్వ చేయాలి.
- ముందుగా ఉల్లిగడ్డ పైకి ఎలా ఉందో పరీక్షిండి. తొక్కలలో విచిత్రమైన నల్ల మచ్చలు ఉంటే అది పాడవ్వడం ప్రారంభించి, చివరికి కుళ్ళిపోవచ్చు.
- గడ్డలు మొలకెత్తాయేమో ఎప్పటికప్పుడు పరిశీలించండి. ఎందుకంటే ఇది ఉల్లి చెడిపోవడం ప్రారంభించిందని సూచిస్తుంది.
- ఉల్లిగడ్డను తాకండి. అవి మెత్తగా మారినట్టయితే వాటిని తీసుకోవద్దు. అలాగే ఉల్లి నుండి విచిత్రమైన కుళ్ళిన వాసన ఉంటే వాటిని తీసి పడేయండి.