Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్ని రోజులుగా మధ్యాహ్నం పూట ఎండలు మండిపోతున్నాయి. వేసవి ప్రారంభం కావడంతో ప్రకృతి ప్రసాదించిన పండ్లకు వ్యాపారం పెరుగుతోంది. ఈ కాలంలో వీధుల్లో నీళ్లు, జ్యూస్, చెరుకు రసం షాపుల తర్వాత పుచ్చకాయల దుకాణాలు రెండో స్థానంలో ఉన్నాయి. ముదురు ఎరుపు పుచ్చకాయ ముక్కలను చిన్న ముక్కలుగా కట్ చేసి గాజు పెట్టెలో ఉంచి, కప్పులో చొప్పించిన కర్ర మనలను స్వయంగా ఆ దుకాణాల వైపుకు లాగుతుంది. వేసవిలో చాలామంది ఎక్కువగా ఇష్టపడే పండ్లలో ఇది కూడా ఒకటి. ఈ పండులో అధిక మొత్తంలో నీరు ఉండటం వల్ల వేసవిలో ప్రజలు దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు. పుచ్చకాయ పండు వేసవిలో దాహం, శరీర వేడిని తీర్చడానికి ఉపయోగపడతుంది. ఇందులో మన శారీరక ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. గుండె, మూత్రపిండాలతో సహా శరీరంలోని అనేక ముఖ్యమైన అవయవాలను రక్షించే సామర్థ్యం పుచ్చకాయకు ఉంది.
రక్తపోటును నిర్వహించడం: పుచ్చకాయలో పొటాషియం, మెగ్నీషియం ఉన్నాయి. ఇవి సమతుల్య రక్త ప్రవాహాన్ని నిర్వహించడానికి, రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. పుచ్చకాయలోని ఎలక్ట్రోలైట్స్ శరీర రక్తపోటును సాధారణ స్థితికి తీసుకురావడానికి కూడా సహాయపడతాయి.
జీర్ణక్రియకు సహాయపడుతుంది: పుచ్చకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలోని జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఈ పండులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలోని హానికరమైన టాక్సిన్స్‌ను రోజూ బయటకు పంపడానికి సహాయపడుతుంది. మలబద్దకాన్ని సరిచేస్తుంది.
శక్తిని ఇస్తుంది: సాధారణంగా వేసవిలో శరీరంలోని శక్తి త్వరగా తగ్గిపోతుందని భావించి బయటకు వెళ్లకుండా ఉంటాం. కానీ ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒక గ్లాసు పుచ్చకాయ జ్యూస్ తాగితే మన ఎనర్జీ లెవల్లో పెద్ద మొత్తంలో కనిపిస్తుంది. పుచ్చకాయలోని ఎలక్ట్రోలైట్లు, ఖనిజాలు మన శరీరాన్ని హైడ్రేట్ చేయడం, ఉత్తేజపరిచే పనిని చేస్తాయి.
గుండెను రక్షిస్తుంది: పండులో లైకోపీన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి యాంటీఆక్సిడెంట్లు గుండె రక్షణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పుచ్చకాయలో ఉండే పొటాషియం గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.
బరువు తగ్గడం: పుచ్చకాయలో తక్కువ కేలరీలు, అధిక నీటి కంటెంట్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాబట్టి త్వరగా బరువు తగ్గాలనుకునే వారు ఈ పండును రెగ్యులర్‌గా తినడం మంచిది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: పుచ్చకాయలోని లైకోపీన్ ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది క్యాన్సర్, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యల ప్రమాదం నుండి మనల్ని రక్షిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గాయాలను త్వరగా మాన్పించే శక్తి కూడా దీనికి ఉంది.
కంటి చూపుకు: పుచ్చకాయ రసం తాగడం వల్ల శరీరానికి శక్తినిచ్చే విటమిన్ ఎ లభిస్తుంది. ఈ విటమిన్ మన కండ్లకు చాలా అవసరం. ఇందులోని బీటా కెరోటిన్ కంటి సంబంధిత సమస్యల నుంచి మనల్ని రక్షిస్తుంది.