Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్కిన్ ఇన్ఫ్లమేషన్, ఇరిటేషన్ను సరిచేయడంలో చందనం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా చర్మంపై మంటను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. దీన్ని చాలా సౌందర్య సాధనాల ఉత్పత్తులలో విస్తృతంగా ఉపయోగిస్తారు.
- ఒక గిన్నెలో గంధపు పొడిలో కొద్దిగా రోజ్ వాటర్ కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకుని ముఖానికి పట్టించాలి. ఈ ప్యాక్ జిడ్డు చర్మానికి మంచిది.
పొడి చర్మం ఉన్నవారు ఆరెంజ్ జ్యూస్‌లో పాలు లేదా ఆలివ్ ఆయిల్, గంధపు పొడి కలిపి ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవచ్చు.
- చర్మంపై వచ్చే మొటిమలు తగ్గాలంటే కొద్దిగా గంధపు పొడిని తీసుకుని అందులో పసుపు, నిమ్మరసం కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇది చర్మాన్ని చల్లబరచడమే కాకుండా చర్మంలో మొటిమలకు కారణమయ్యే అదనపు బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది.
- కొద్దిగా పెరుగు, పాలు, గంధపు పొడి కలిపి రాసుకుంటే పాలిపోయిన ముఖం కాంతివంతంగా మారుతుంది. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ ప్రాంతంలో అప్లై చేసి పది నిమిషాలు మసాజ్ చేసి, చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఈ మాస్క్ వేసుకుంటే చర్మం మృదువుగా, తెల్లగా మారుతుంది.
- మీ చర్మం నిర్జీవంగా కనిపిస్తే గుడ్డులోని తెల్లసొన, పెరుగు, కొద్దిగా యాపిల్ జ్యూస్, గంధపు పొడిని మిక్స్ చేసి అప్లై చేయండి. ఆరిన తర్వాత కడిగేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే యవ్వన చర్మాన్ని పొందవచ్చు.
- అర టీస్పూన్ ముల్తానీ మట్టీ, అర టీస్పూన్ గంధపు పొడి వేసి పెరుగు పోసి మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి చర్మం కాంతివంతంగా ఉంటుంది.