Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాఠశాల స్థాయి అయినా, కళాశాల అయినా, పోటీ పరీక్ష అయినా, ఏదైనా ప్రవేశ పరీక్ష అయినా... అన్నింటికీ ప్రిపరేషన్ సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురికావడం సహజం. ఒక్కోసారి ఇంటి వాతావరణం చాలా కఠినంగా ఉండడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి మరింత పెరుగుతుంది. పరీక్ష సన్నద్ధత సమయంలో లేదా పరీక్షలు రాస్తున్నపుడు విద్యార్థులు నిరాశ చెందడం సర్వసాధారణం అయ్యాయి. వాస్తవానికి కొంతమంది విద్యార్థులు ప్రతిదీ మరచిపోయి చదువులో బిజీగా ఉంటారు. ఇది వారి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే పరీక్షలకు సిద్ధమయ్యే వారు కొన్ని చిట్కాలను పాటించాలి.
పాఠశాలల్లో ఆఖరి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తున్నారు. 10, 12వ తరగతి విద్యార్థులు బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కళాశాల విద్యార్థులు సెమిస్టర్ ముగింపు పరీక్షలు ఇవ్వనున్నారు. ఇది మాత్రమే కాదు వివిధ అభ్యర్థులు ఎన్నో పోటీ పరీక్షలకు కూడా సిద్ధమవుతారు. పరీక్షల సమయంలో సాధారణంగా విద్యార్థులు ఇష్టం లేకపోయినా ఒత్తిడిని తీసుకోవడం ప్రారంభిస్తారు. ఈ సమయంలో విద్యార్థులు డిప్రెషన్ లక్షణాలలోకి వెళుతున్నారనే వార్తలు కూడా చాలా సాధారణంగా వింటూనే ఉన్నాం.
మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోండి: పరీక్ష సమయంలో మీ శారీరక, మానసిక ఆరోగ్యంపై దృష్టిని పెంచాలి. పరీక్ష ప్రారంభానికి ముందు మీ ఆహారం, పానీయం, వ్యాయామ దినచర్యను సరిచేసుకోండి. పరీక్షల క్లిష్ట దశలో మానసిక ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలను తెలుసుకోండి.
రెండున్నర గంటల తర్వాత ప్రతి అరగంటకు లేదా గంటకు విరామం తీసుకోండి. ఈ సమయంలో ఒకే చోట కూర్చోకుండా కొంచెం అటూ ఇటూ నడవండి.
ఏకాగ్రతను పెంచడానికి, మనసును ప్రశాంతంగా ఉంచడానికి వ్యాయామాన్ని మీ దినచర్యలో చేర్చండి.
- అనవసరమైన పరధ్యానాల నుండి మిమ్మల్ని మీరు తొలగించుకోండి.
- సోషల్ మీడియాను కొంత దూరం పెట్టి పార్టీలు మొదలైనవాటిని మరిచిపోండి.
- స్టడీ బ్రేక్‌లో సంగీతం వినండి, అవుట్డోర్ గేమ్స్ ఆడండి, డ్యాన్స్ చేయండి.
- మీ అభిరుచికి కొంత సమయం ఇవ్వండి. ఈ సమయంలో టీవీ చూడవద్దు. దీంతో కండ్లకు విశ్రాంతి లభిస్తుంది.