Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుర్గా శక్తి నాగ్‌పాల్... ఓ సాహసోపేతమైన అధికారి... ఇద్దరు పిల్లలకు తల్లి... ఇప్పుడు రచయితగా మారింది. విమెన్ ఆన్ ఎ మిషన్ సమ్మిట్ 2022లో తన శక్తిని చాటి చెప్పింది. తన స్ఫూర్తిదాయ జీవితాన్ని మనందరితో పంచుకుంటుంది. మహిళలు తమ సొంత ఆలోచనలకు, ఆరోగ్యానికి విలుల ఇవ్వాలని చెబుతోంది. కోవిడ్-19 రెండేండ్లు మాత్రమే ప్రపంచాన్ని కుదిపేసింది. కానీ ''మహిళల జీవితంలో ఒక మహమ్మారి ఎల్లప్పుడూ ఉంటుంది'' అంటున్న ఆమె గురించి మరిన్ని విశేషాలు...
మహిళా దినోత్సవాన్ని ప్రతిరోజూ జరుపుకోవాలి. ''స్త్రీ లేకుండా ఒక రోజును ఊహించుకోండి. ఆ ఆలోచన వినాశనం సృష్టిస్తుంది. కాబట్టి ఆమె ఉనికిని కాపాడుకుంటూ... ఆమె ముఖంపై చిరునవ్వు ప్రతిరోజూ ఉండేలా చూసుకోవాలి. ఆమె బలం, సత్తువ ప్రతి రోజు గుర్తించబడాలి'' అని అన్నారు. దుర్గ.
పని భారం పెరిగింది
మహమ్మారి మహిళల పనిభారాన్ని అనేక రెట్లు పెంచింది. చాలామంది ఇంటి నుండి పని చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఇంటి పనిలో సహాయం చేసే వారు కూడా రాలేని పరిస్థితి. దాంతో వంట చేయడం, పిల్లలను చూసుకుంటూ అన్ని పనులు చేయాల్సి వచ్చేదని 2010 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ దుర్గా గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన (ఐఎఎస్) అధికారి, ఇటీవలే తన 'గ్రో యువర్ బేబీ నాట్ యువర్ వెయిట్' పుస్తకంతో రచయితగా మారారు.
మాతృత్వ జ్ఞాపకం రాయడం
ఆమె రెండవసారి గర్భవతిగా ఉన్నపుడు ఓ శీర్షికతో పుస్తకాన్ని రాయడం ప్రారంభించింది. గర్భం ధరించిన రెండవ త్రైమాసికంలో ఆమెకు పుస్తకం రాయాలనే ఆలోచన వచ్చింది. ''నా బిడ్డ మాత్రమే పెరుగుతోందని నేను భావించాను. నా లోపల ఉన్న శిశువు పెరుగుతోంది. కాస్త ఎక్కువో, తక్కువో నా శరీరం మొత్తం ఫిట్‌గా ఉంది. నా శరీరంలోని ఇతర భాగాలలో నేను బరువు పెరగలేదు. ఇది సాంప్రదాయకంగా గర్భిణీ స్త్రీ అనుభవించే అంశమే''అని దుర్గ పంచుకున్నారు.
విలువైనదాన్ని రాయాలని
ఆమె తన రెండు గర్భాల సమయంలో అనేక వ్యాయామాలకు, ఆరోగ్యకరమైన ఆహారానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది. మాతృత్వ ప్రయాణంలో తేలికైన టేక్ ద్వారా ఆమె పాఠకులపై సానుకూల ప్రభావం చూపడానికి, విలువైనదాన్ని రాయాలనే ఆలోచన ఉంది. తల్లుల కోసం కొన్ని సులభమైన వంటకాలను కూడా ఇందులో పొందుపరిచింది.
ఆమే ఒక సైన్యం
''మేము మల్టీ టాస్కర్లుగా పుట్టాము. పిల్లలను పెంచడం నుండి ఇంటిని నడిపించడం వరకు జీవనోపాధి వరకు మేము మొత్తం నడుపుతున్న మహిళే ఓ సైన్యం'' అని దుర్గ అంటున్నారు. మహిళలు వారి ఆరోగ్యం, పోషకాహారంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం అని అంటున్నారు. ఎందుకంటే మహిళలు సాధారణంగా రోజువారి పనిలో బిజీగా గడిపేస్తూ వారి జీవితంలోని ఈ అంశాన్ని విస్మరిస్తారు. వాస్తవానికి ఆరోగ్యం, పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వారి పనితీరును మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడుతుంది.
శక్తి కేంద్రంగా ఎదుగుతుంది
మహిళలు వారి భారాన్ని తగ్గించుకోవడానికి కుటుంబ మద్దతు, సమాజ మద్దతు వ్యవస్థను నిర్మించడం చాలా కీలకం. ''జీవితంలో మీరు చేయాలనుకున్నది చేయమని మిమ్మల్ని ప్రోత్సహించే కుటుంబం, కార్యాలయం ఉండటం కూడా చాలా ముఖ్యం'' అని దుర్గ గుర్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ, ఏ కారణం చేతనైనా ఒక మహిళకు కుటుంబ మద్దతు లేనట్టయితే, ఆమె తనంతట తానుగా శక్తి కేంద్రంగా ఎదుగుతుందని దుర్గ అంటున్నారు. ''ఒక స్త్రీ సహజంగానే పరిపూర్ణతతో పుడుతుంది. మనం ఆమె బలాలను గుర్తించగలిగితే ఆమె తన సొంత సాధికారత ప్రయాణాన్ని రూపొందించగలదు. దానిని పెద్దదిగా చేయడానికి, తన కలలను కొనసాగించడానికి ఆమె లోపల శక్తి దాగి ఉంది'' అని ఆమె జత చేస్తున్నారు.
ఏ విషయంలోనూ
రాజీ పడను
దుర్గను తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాన్ని ఎలా సమతుల్యం చేసుకుంటున్నారో అడిగితే ''నా విషయానికొస్తే నేను నా కెరీర్‌ను ప్రేమిస్తున్నాను. నేను తల్లిగా ప్రేమిస్తున్నాను. నన్ను నేను ప్రేమిస్తున్నాను. నా జీవితంలోని ఏ విషయంలోనూ నేను రాజీపడను. అది నా ప్రయాణాన్ని సాఫీగా చేస్తుంది'' అని ఇప్పుడు తాను రాసిన పుస్తకం విడుదల కోసం ఎదురుచూస్తున్న దుర్గ పంచుకున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఆమె బయోపిక్ బయటకు వస్తుంది.
ఇసుక కుంభకోణాన్ని అరికట్టడంలో...
2013లో అప్పటి నోయిడా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌గా ఉన్న దుర్గా ఉత్తరప్రదేశ్‌లోని ఇసుక గనులపై దాడి చేసినందుకు మొదటి పేజీ జాతీయ వార్తల్లోకి వచ్చారు. అక్రమ ఇసుక కుంభకోణాన్ని అరికట్టడంలో ఆమె చేసిన ప్రయత్నాలను గుర్తుచేసుకున్న దుర్గ.. తన బృందంతో కలిసి రాత్రి 2 గంటలకు ఎలా దాడులు చేస్తారో గుర్తుచేసుకున్నారు. కనీసం పన్నెండు మందిని అరెస్టు చేసి, ఎనిమిది నుండి 10 ట్రక్కులను స్వాధీనం చేసుకుంటారు. రెండు వారాల వ్యవధిలో కోట్లకు పైగా రాయల్టీని రికవరీ చేయడమే కాకుండా, రికార్డు సృష్టించిన సంఖ్య. ఈ సాహసోపేతమైన ప్రచారంగా మారింది. ఉద్యోగం చేస్తున్న దుర్గ ఎప్పుడూ తనను తాను ఓ మహిళా ఉద్యోగిగా ఎన్నడూ భావించలేదు. అందువల్ల ఆమె ఉద్యోగం మరింత సవాలుతో కూడుకున్నది. స్థానికులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వర్గాల నుండి మద్దతు వచ్చింది.
బలమైన బృందాన్ని కలిగి ఉండాలి
ఆమె రాస్తున్న బయోపిక్ ఆమె స్ఫూర్తిదాయకమైన జీవిత కథను గుర్తించబోతోంది. ఇసుక మైనింగ్ ఎపిసోడ్, ఆమె ఎదుర్కొంటున్న బెదిరింపులు, శారీరకంగా దాడి చేయడం వంటి అంశాలను కవర్ చేస్తుంది. ఇందులో దుర్గా మహిళా పారిశ్రామికవేత్తల ప్రయాణం, మహిళా నాయకత్వ పెరుగుదలను ఆమె ఎలా దగ్గరగా అనుసరిస్తుందో చెప్పడం మర్చిపోలేదు. ''ఒక మహిళ తన కెరీర్‌ను వేరే స్థాయికి తీసుకెళ్లడానికి ఆమె ఎంత ఎక్కువ ప్లాన్ చేసుకుంటే అంత మంచిది. రెండవది... మీరు పనిని అప్పగించగల బలమైన బృందాన్ని కలిగి ఉండటం ముఖ్యం. మీ విజయం యొక్క క్రెడిట్ మీ బృందానికి చెందాలి. అదే నాయకుడికి నిజమైన చిహ్నం'' అంటూ ఆమె తన మాటలు ముగించారు.