Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రంగురంగుల హోలీ సమీపిస్తోంది. ఈ పండుగకు మనం వాడే రంగుల్లో ఏవేవో కెమికల్స్ కలుపుతారు. అయితే నేచురల్ పద్ధతిలో కూడా మనం ఇంట్లోనే హోలీ రంగులను తయారు చేసుకోవచ్చు. ఈ పండుగ కోసం చిన్నపిల్లలు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఓ వారం ముందునుంచే రకరకాల రంగులు, స్ప్రేలు రెడీ చేసుకుంటారు. ఫ్రెండ్స్‌కు హోలీ రంగులను పూస్తారు. సహజసిద్ధమైన రంగులు కాకుండా కృత్రిమ రంగులు వాడడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా శరీరంపై మచ్చలు ఏర్పడతాయి. అవి శ్వాస కాలేయ సంబంధిత సమస్యలను కూడా తీసుకొస్తాయి. అందుకే కృత్రిమ రంగులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈసారి నేచురల్ రంగులతో ట్రై చేయండి. వాటిని మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అదేలానో చూద్దాం.
- పసుపు, శనగపిండిని కలిపి రంగుగా పూయొచ్చు. పసుపు, శనగపిండి 20:80 రేషియోలో కలపాలి.
- పసుపులో నిమ్మకాయ రసం కలిపింతే కూడా ఎరుపు రంగు వస్తుంది. దీంతో రెడ్ కలర్‌ను నేచురల్ పద్ధతిలో పొందినట్లవుతుంది. కాకపోతే ముందుగా కాస్త ఎండ తగలనిచ్చి ఆరనివ్వాలి. అప్పుడే రెడ్ కలర్ తయారవుతుంది.
- మీకు పింక్ కలర్ కావాలంటే పసుపులో లెమన్ జ్యూస్ కాస్త తక్కువగా వేసుకుంటే రాణి రంగు వచ్చేస్తుంది.
- పూలను ఆరబెట్టి వాటిని మిక్సీ పట్టాలి. వీటన్నింటిని నీటిలో కలిపి కూడా చల్లొచ్చు.
- ఎర్రచందనం, చందనం పొడులను హోలీ రంగులుగా వాడొచ్చు. దీన్ని నేరుగా పూయొచ్చు లేదా నీటిలో కలిపి రాయొచ్చు.
- దానిమ్మ గింజలు, బీట్రూట్ మంచి కలర్స్నిస్తాయి. వీటిని మిక్సీ పట్టి లేదా కాస్తా మెదిపి రంగుగా పూయొచ్చు.
- గోరింటాకు, మైదాపిండిని సమపాళ్లలో తీసుకుంటే గ్రీన్ కలర్ సిద్ధమవుతుంది. రకరకాల పూలు, పండ్లతో తీసిన రంగులను కూడా వీటికి కలిపి రాయొచ్చు. మంచి సువాసన రావంటే దీనికి 10 ఎంఎల్ రోజ్ వాటర్‌ను కలపండి.
- నాలుగైదు బ్లాక్ క్యారట్ గ్రైండ్ చేసి దానికి 250 గ్రాములు కార్న్ ఫ్లోర్ కలపాలి. ఇప్పుడు 10 ఎంఎల్ రోజ్ వాటర్ కలిపితే పర్పుల్ కలర్ వస్తుంది.
- మీకు ఊదా రంగు కావాలంటే ఉసిరి కాయను కావాల్సిన మోతాదులో గ్రైండ్ చేసి దానికి కార్న్ ఫ్లోర్, రోజ్ వాటర్ కలపాలి. కాస్త ఎండలో ఆరనివ్వాలి.
- రకరకాల చెట్ల ఆకులు, బెరళ్ళని నానబెట్టి ఆ రంగులను కూడా హోలీ కోసం వాడొచ్చు.
- పండ్ల తొక్కలను కూడా రంగులుగా మార్చొచ్చు. ఒకవేళ వెంటనే ఉపయోగించాలనుకుంటే వాటిని కాస్తా నీటిలో వేసి మరిగించి వాడుకోవచ్చు.