Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లం ఎన్నో అనారోగ్య సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేయడానికి, కడుపుని మరింత త్వరగా ఖాళీ చేయడానికి సహాయపడుతుంది. అజీర్ణం, అల్సర్లు, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలతో సతమతమయ్యేవారు ఎవరైనా దీనిని తమ రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.
- రుతుక్రమంలో నొప్పి సాధారణంగా వస్తుంటుంది. ఇలాంటి సమయంలో మొదటి మూడు రోజులు అల్లం తీసుకోవడం ద్వారా ఋతు చక్రం వల్ల కలిగే నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
- పచ్చి అల్లంలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనం, దాని యాంటీమైక్రోబయల్, యాంటీ ఫంగల్ లక్షణాలతో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అల్లంలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ లక్షణాల కలయిక అనేక ప్రయోజనాలను కలిగి ఉంది.
- అల్లం దగ్గును నిరోధిస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
- అల్లంపై చేసిన అధ్యయనాల ప్రకారం ఇందులో వుండే జింజెరాల్‌లోని కొన్ని ప్రయోజనాలు కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తాయని తేలింది.
- ఇది అన్నింటికీ నివారణ కానప్పటికీ, దాని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి.
- తరచుగా క్యాన్సర్ చికిత్సతో సంబంధం ఉన్న వికారం, నొప్పి లక్షణాలను తగ్గించడానికి అల్లం కూడా సురక్షితమైనదని వైద్య నిపుణులు చెపుతారు.
అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్లనొప్పులతో వచ్చే నొప్పిని తగ్గించి, కీళ్ల కదలికను పెంచుతాయి.
- ఆర్థరైటిస్ బాధితులు తరచుగా వారి సమస్యను తగ్గించడానికి యాంటీ ఇన్ఫ్లమేషన్ మందులను సూచిస్తారు. అయితే అల్లం సహజ ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.
- అల్లం రక్తాన్ని పలుచగా చేస్తుంది. ఫలితంగా ఇది హృదయ సంబంధ సమస్యలను నివారించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. రక్తం పలచబడేవి రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
- ఇది గుండెపోటు, స్ట్రోక్‌ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అల్లం రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సాయపడుతుంది.
- అల్లం తీసుకోవడం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
- అల్లం ఇన్సులిన్ స్థాయిలను నియంత్రిస్తుంది. జీవక్రియను పెంచుతుంది.