Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెరుగు తింటే శరీరానికి ఎంత మేలు. ముఖానికి పూసుకుంటే కూడా నిగారింపునిస్తుంది. పెరుగు ఎప్పుడూ చర్మ సంరక్షణకు ఉత్తమమైనది. దీన్ని ఉపయోగించడం వల్ల పాత చర్మ కణాలు తగ్గి, ఆరోగ్యకరమైన కొత్త సెల్లు పెరుగుతాయి.
- టీస్పూన్ బియ్యం పిండి, అదే పరిమాణంలో పెరుగు కలపండి. ఈ మిశ్రమంలో ఒక టీస్పూన్ నిమ్మకాయ రసం కలపండి. దీంతో కాసేపు ముఖంపై మర్దనా చేసుకోవాలి. ఆ తర్వాత నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది.
- రెండు టీస్పూన్ల ఆలివ్ నూనె, టీస్పూన్ తేనె తీసుకోవాలి. దీనికి రెండు టేబుల్ స్పూన్ల పంచదార జోడించండి. ఒక పాత్రలో అన్ని పదార్థాలను కలిపి పేస్ట్ చేసి ముఖం అంతా పూసుకోండి. ఆరిన తర్వాత రెండు మూడు నిమిషాలు మసాజ్ చేయండి. ఆ తర్వాత నీళ్లతో ముఖాన్ని బాగా కడుక్కోండి. వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. .
- ఒక చిన్న గిన్నెలో టీస్పూను ఓట్స్ తీసుకోండి. రెండు టీస్పూన్ల పెరుగు, టీస్పూన్ తేనె జోడించండి. ఈ మూడింటిని కలపండి. ముఖానికి ఈ మిశ్రమాన్ని పూయండి. ఐదారు నిమిషాలు ముఖాన్ని మసాజ్ చేయండి. నీటిలో కడుక్కోండి. మీకు ఇష్టమైన మాయిశ్చరైజర్ను ఉపయోగించండి.