Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జుట్ట రాలడం సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. పని ఒత్తిడి, అనారోగ్యం, గర్భధారణ, థైరాయిండ్ వంటి సమస్యలతో చాలామంది జుట్టును కోల్పోతున్నారు. కొందరు జుట్టును కాపాడుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు. దాని వల్ల ఫలితం లేక పోగా అనేక ఇతర సమస్యలు కూడా వస్తుంటాయి. అలాంటి వారి సమస్యలు పరిష్కరించడం కోసమే రిచా గ్రోవర్ బద్రుకా, రైనా గ్రోవర్ అనే ఇద్దరు అక్కచెల్లెళ్ళు కలిసి 1 హెయిర్ స్టాప్ ప్రారంభించారు. అలసు దాని విశేషాలు ఏంటో మనమూ తెలుసుకుందాం...
రిచా గ్రోవర్ బద్రుకా (30), రైనా గ్రోవర్ (28) గ్రాడ్యుయేషన్ తర్వాత తమ కెరీర్ మార్గాన్ని ఎంచుకున్నారు. భారతీయ మహిళలు జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఆ సమస్యను పరిష్కరించు కునేందుకు సరైన ప్రయత్నం చేయడం లేదని వారు గ్రహించారు.
మన దగ్గర డిమాండ్ లేదు
''నేను మా నాన్నగారి వ్యాపారంలో చేరినప్పుడు రైనా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలో ఉద్యోగంలో చేరింది. నేను అంతర్జాతీయ విక్రయాలను నిర్వహిస్తుంటాము. మేము ఎగుమతి చేస్తున్న జుట్టుతో తయారు చేసిన హెయిర్ ఎక్స్టెన్షన్లకు ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్ కనిపించింది. అయితే మన భారతదేశంలో మాత్రం చాలా తక్కువ డిమాండ్ ఉంది'' అని రిచా చెప్పారు.
అనేక సమస్యల వల్ల
ప్రస్తుతం అధిక శాతం మహిళలు జుట్టు రాలడం, జుట్టు పల్చబడటం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలలో చాలా వరకు కోవిడ్-19, గర్భం, థైరాయిడ్ రుగ్మతలు, రక్తహీనత, పిసిఒఎస్, సోరియాసిస్, సెబోరీÛక్ డెర్మటైటిస్‌తో వంటి వాటి వల్ల ఏర్పడుతున్నాయి. ప్రత్యామ్నాయ చికిత్సలు, మందులతో ఫలితాలు ఆశించిన విధంగా ఉండవు.
డిమాండ్‌లేని మార్కెట్లోకి
భారతదేశంలో ఉపయోగించబడని ఈ అవకాశాన్ని రిచా చూసింది. తన సోదరితో హెయిర్ ఎక్స్టెన్షన్ బ్రాండ్‌ను ప్రారంభించే ఆలోచన గురించి చర్చించింది. ఈ సమయానికి రైనా తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి పూర్తి సమయం వ్యాపారంలోకి ప్రవేశించింది. అయితే ఈ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ అప్పటికి మన దేశంలో డిమాండ్ లేని మార్కెట్లోకి అడుగుపెట్టారు.
సులభంగా ఉపయోగించేలా
అక్టోబరు 2019లో ఇద్దరూ కలిసి 1 హెయిర్ స్టాప్‌ను ప్రారంభించారు. ఇది జుట్టు పల్చబడటం, జుట్టు రాలడం వంటి వివిధ దశల్లో ఉన్న మహిళల కోసం సులభంగా ఉపయోగించగల లగ్జరీ హెయిర్ ఎక్స్టెన్షన్లు, టాపర్లు, క్లిప్-ఆన్‌లను అందిస్తుంది. మూడు సంవత్సరాలుగా భారతీయ మార్కెట్లో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరుచుకున్న రిచా టర్నోవర్‌ను వెల్లడించలేదు కానీ భారతదేశం అంతటా లక్ష మంది కస్టమర్లకు సేవలు అందించినట్టు పేర్కొన్నారు.
నిషేధాన్ని బద్దలు కొట్టడం
నేటి ఆధునిక యుగంలో భారతదేశంలో జుట్టు రాలడం సమస్యలను ఎదుర్కొంటున్న స్త్రీలను విచిత్రంగా చూస్తారు. అయితే మగవాళ్ళ బట్టతలను మాత్రం పెద్దగా పట్టించుకోరు. దాని ఆమోదిస్తారు అని రిచా చెప్పారు. ''మేము జుట్టు రాలడం సమస్యల గురించి మాట్లాడుతూ మహిళలపై ఈ విషయంలో ఉన్న నిషేధాన్ని విచ్ఛిన్నం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. మా ఉత్పత్తులపై మహిళల్లో సాధారణ అభిప్రాయం ఏమిటంటే అది విగ్. కాని ఇది పూర్తిగా తప్పు'' అని ఆమె చెప్పారు.
అవగాహన కల్పించేందుకు
''వాల్యూమైజర్ల నుండి జుట్టుకు వాల్యూమ్ ఇవ్వడానికి క్లిప్-ఆన్ బ్యాంగ్స్, హాలో ఎక్స్టెన్షన్లు, పోనీటైల్ ఎక్స్టెన్షన్లు, మెస్సీ బన్ స్క్రాంచీ వంటివి ఎన్నో జుట్టు సమస్యను బట్టి మా వద్ద అనేక రకాలు ఉన్నాయి'' అంటున్నారు ఆమె. 1 హెయిర్ స్టాప్ హెయిర్పీస్, యాక్సెసరీలు కస్టమర్ల అవసరం, అనుకూలీకరణను బట్టి వాటి ధరలు రూ. 1,200 నుండి రూ. 35,000 మధ్య ఉంటాయి. ఉత్పత్తుల గురించి అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నందున ప్రారంభ కొన్ని నెలలు వారికి సవాలుగా మారింది. రైనా డిజిటల్ మార్కెటింగ్ అనుభవం ఇక్కడ కీలక పాత్ర పోషించిందని రిచా చెప్పారు.
కస్టమర్లను సంపాదించుకుంది
''రైనా డిజిటల్ మార్కెట్ ప్రచారాలలో సహాయం చేస్తుంది. అక్కడ మేము మోడల్స్ కాదు, జుట్టు రాలడం సమస్యలతో పోరాడుతున్న మహిళలు, మా ఉత్పత్తుల గురించి మాట్లాడటానికి సహాయపడే వీడియోలను తయారు చేసాము. ఇది చాలా మంది కస్టమర్లను సంపాదించుకుంది. జనవరి 2020 నాటికి మేము అమ్మకాలను పొందడం ప్రారంభించాము'' అని ఆమె జతచేస్తుంది.
మా సవాలు మా అవకాశం
ప్రారంభంలో 1 హెయిర్ స్టాప్ నెలలో దాదాపు 50 నుండి 100 ఆర్డర్లను పొందింది. కానీ నేడు బ్రాండ్ విపరీతంగా పెరుగుతోంది. ప్రతిరోజూ సగటున 150 ఆర్డర్లను అందుకుంటుంది. గిరాకీని సృష్టించడం గురించి రిచా మాట్లాడుతూ ''మా సవాలు మా అవకాశం'' అంటున్నారు. ఆమె బ్రాండ్ సరైన కస్టమర్లను లక్ష్యంగా చేసుకోవడంలో సవాళ్లను కనుగొంటుంది. అది ప్రజలకు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడటం వలన అది మరిన్ని అవకాశాలను కనుగొంటుంది. వాస్తవానికి మగ ఆధిపత్యంలో నడుస్తున్న జుట్టు పొడిగింపు పరిశ్రమ సోదరీమణులకు అనేక సవాళ్లను ఎదుర్కొనేలా చేసింది. ఎందుకంటే ప్రజలు మహిళలను అమాయకులుగా భావిస్తారు. వ్యాపారం చేయడం రాదనుకుంటారు. అయినా అక్కచెల్లెళ్ళు ఇద్దరూ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిటారుగా నిలబడ్డారు.
వంద శాతం మానవ వెంట్రుకలే
1 హెయిర్ స్టాప్ ఉపయోగించిన వెంట్రుకలన్నీ 100 శాతం మానవ వెంట్రుకలు. దక్షిణ భారతదేశంలోని దేవాలయాల నుండి వేలం ద్వారా సేకరించబడ్డాయి. దీని ప్రాథమిక వనరులలో ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి బాలాజీ ఆలయం. ఇక్కడ లక్షలాది మంది భక్తులు తమ జుట్టును దానం చేస్తారు. కంపెనీ తన ఉత్పత్తులన్నింటినీ రిచా తండ్రి అంతర్గత తయారీ కేంద్రంలో తయారు చేస్తుంది. ''మేము మూడవ వ్యక్తిపై ఆధారపడటం లేదు కాబట్టి తయారీ బ్యాకప్ మాకు అతిపెద్ద ప్రయోజనం. ఇది ఎటువంటి అవాంతరాలు లేకుండా స్థిరమైన ఆవిష్కరణలకు కూడా సహాయపడుతుంది'' ఆమె చెప్పారు.
ముందుకు మార్గం
నిజమైన మానవ జుట్టుతో తయారు చేయబడిన విగ్గులు ఉత్తమమైనవి. ఎందుకంటే వాటి క్యూటికల్స్ భద్రపరచబడ్డాయి. వాటి ఆకృతిని సిల్కీగా, సులభంగా నిర్వహించేలా చేస్తుంది. సరైన జాగ్రత్తలు తీసుకుంటే 1 హెయిర్ స్టాప్ ఉత్పత్తి 10 సంవత్సరాల వరకు ఉంటుందని రిచా అంటున్నారు. ఇది హెయిర్ ఒరిజినల్, బ్యూక్స్ వంటి మరిన్ని బ్రాండ్లతో పోటీపడుతుంది. భవిష్యత్ అవకాశాల గురించి రిచా మాట్లాడుతూ 1 హెయిర్ స్టాప్ భారతదేశం నుండి వచ్చిన బ్రాండ్ అని సెలూన్ నిపుణుల కోసం భారతదేశంలోనే మొట్టమొదటి సెమీ-పర్మనెంట్ ఎక్స్టెన్షన్లను పరిచయం చేయడానికి తాము ఎదురుచూస్తున్నామని చెప్పారు. వృద్ధ మహిళలకు సాల్ట్ అండ్ పెప్పర్ నేచురల్ గ్రే హెయిర్ ఎక్స్టెన్షన్లను అందించాలని కూడా సోదరీమణులు ప్లాన్ చేస్తున్నారు. తన ఉత్పత్తులను పాన్-ఇండియాలో అందుబాటులో ఉంచడానికి మెట్రో నగరాల్లోని ప్రధాన సెలూన్లతో దీ2దీ విక్రయాలను ప్రారంభించాలని కూడా యోచిస్తున్నారు.