Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాంకేతిక రంగంలో మనం ఇంకా చాలా దూరం వెళ్ళవలసి ఉంది. ఇటీవల కాలంలో ఈ రంగంలో వైవిధ్యం, ఈక్విటీ, మహిళల చేరికపై శ్రద్ధ చూపినప్పటికీ సాంకేతికతలో స్త్రీ భాగస్వామ్యం ఇప్పటికీ సరైనదిగా లేదు. నాయకత్వ స్థానాలను వెళ్ళగలిగే ప్రతిభావంతులైన మహిళలు ఎందరో మనకు అందుబాటులో ఉన్నప్పటికీ 'ఉమెన్ ఇన్ టెక్' ట్యాగ్ లింగ అసమానత కొనసాగుతుందనే వాస్తవాన్ని నొక్కి చెబుతుంది.
బలమైన మహిళా నాకయత్వం కోసం
'సాంకేతికతలో బలమైన మహిళా నాయకత్వ పాత్రలను నిర్మించడం' అనే అంశంపై హర్స్టోరీస్ ఆధ్వర్యంలో ప్యానెల్ చర్చ జరిగింది. ఈ చర్చల్లో స్థూపం స్పోర్ట్స్ అనలిటిక్స్ వ్యవస్థాపకురాలరైన మేఘా గంభీర్, డైరెక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అండ్ లీడర్ మధురిమా పాల్గొన్నారు.
మంచి నాయకులుగా మారడానికి
మహిళలు నెమ్మదిగా సాంకేతికతలో తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంటున్నప్పటికీ, కార్పొరేట్ నేపధ్యంలో వారికి నిజంగా ఏమి ఇస్తుంది? వారి పురుష ప్రత్యర్ధుల నుండి వారిని ఏది భిన్నంగా చేస్తుంది? ''మహిళలు మరింత సృజనాత్మకంగా, నిర్మాణాత్మకంగా, కరుణతో, దృష్టి కేంద్రీకరించినట్టు నేను గమనించాను'' అని మేఘా అన్నారు. ఈ వారసత్వ స్వభావం వారు మంచి నాయకులుగా మారడానికి సహాయపడుతుందని మరియు సంస్థను వేగంగా స్కేల్ చేయడంలో సహాయపడుతుందని ఆమె తెలిపారు.
అద్భుతాలు సృష్టించగలదు
మధురిమ మాట్లాడుతూ సాధారణ లక్షణాలే కాకుండా స్త్రీని ప్రత్యేకంగా నిలబెట్టేది ఆమె టేబుల్‌పైకి తీసుకువచ్చే పని. ప్రత్యేకించి వారు నాయకత్వ స్థానాన్ని ఆక్రమించినప్పుడు సానుభూతి కలిగి ఉండటంతో పాటు కంపెనీ పనితీరు కోసం అద్భుతాలను సృష్టించగలదు'' అని ఆమె జోడించారు.
టెక్ గురించి అపోహలను ఛేదించడం
మేఘా, అభిలాష ఇద్దరూ తమ టెక్ టీమ్‌లు ఇప్పటికీ మహిళా ఉద్యోగి కోసం వేటలో ఉన్నాయని పంచుకున్నారు. ఆ శోధన సంతృప్తికరమైన ఫలితాలను ఇవ్వలేదు. సాంకేతికతపై చాలా మందికి ఉన్న అపోహలే ఇందుకు కారణం. టెక్ డ్రైగా ఉండటం లేదా బోరింగ్‌గా ఉండటం గురించి వివిధ రకాల తప్పుడు కథనాలు ఉన్నాయని అభిలాష వివరించారు.
రోల్ మోడల్స్ ఉన్నారు
సాంకేతికత చాలా ఉత్తేజకరమైనదని మధురిమ అన్నారు. ''రోజువారీ జీవితాలపై సాంకేతికత ప్రభావం చాలా పెద్దది. కానీ ఈ రంగంలోకి వస్తున్న మహిళల సంఖ్య మారుతోంది. ఈ ప్యానెల్‌లోని వ్యక్తులతో సహా ఈ రోజు మనకు చాలా మంది మహిళా రోల్ మోడల్స్ ఉన్నారు'' అని టెక్ ప్రపంచానికి మహిళలు ఎలా దోహదపడాలనే దానిపై ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యాక్టివ్ డైలాగ్‌ను ఉటంకిస్తూ ఆమె అన్నారు.
మైండ్ సెట్ మార్చడం
మేఘా తన సన్నిహిత వర్గం మద్దతుగా ఉన్నప్పటికీ ఆమె తన సొంత జట్టులో పక్షపాతాలను అనుభవించిందని వెల్లడించింది. ఒక మహిళను మేనేజర్‌గా అంగీకరించడంలో చాలామందికి అసౌకర్యం ఉందని ఆమె పేర్కొన్నారు. ఇవి ఆమెకు సమస్యలను సృష్టించాయి. ఆమె తన కింది అధికారులతో మాట్లాడటం ద్వారా వాటిని పరిష్కరించడానికి తన వంతు కృషి చేసింది. ''కానీ దీనికి మనస్తత్వం మార్పు అవసరం'' ఆమె జోడించారు.
తన గురించి తనకు తెలియదు
అభిలాష మాట్లాడుతూ ఈ పక్షపాతాలు చాలా అంతర్గతంగా ఉన్నాయని అన్నారు. తన సొంత అనుభవాన్ని పంచుకుంటూ ఆమె తన ప్రొఫెసర్లలో ఒకరు ప్రముఖ ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్ అని తెలుసుకున్నప్పుడు తన గురించి తనకు తెలియదని భావించినట్టు పేర్కొన్నారు. కానీ ప్రొఫెసర్ ఆమెలో విశ్వాసాన్ని నింపారు. ఆమె తన తరగతికి చేరుకుంది. ప్రధానంగా అందరూ ఆమెను నూ చేయగలవు అని ఆమెను ప్రోత్సహించారు.
ఇంటర్వ్యూ ప్యానెల్లో సమానత్వం
మధురిమ మాట్లాడుతూ సంస్థలు పక్షపాతాలు ప్రవేశించే అవకాశాలను తగ్గించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. బయటకు కనబడని వివక్ష చాలా ప్రబలంగా ఉందని ఆమె ఆశ్చర్యపోయారు. ''ఇంటర్వ్యూ ప్యానెల్‌లలో సమాన లింగ ప్రాతినిధ్యాలు ఉండేలా చూద్దాం. ఇది అభ్యర్థిని మరింత సౌకర్యవంతంగా చేస్తుంది'' అని ఆమె జోడించారు. ఒక కంపెనీ మహిళలను నియమించుకున్న తర్వాత మహిళా ఉద్యోగులకు అదనపు మద్దతు ఇవ్వడం ద్వారా వారి నైపుణ్యాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టడం చాలా కీలకం. మహిళలు వారు చేసే పనికి గౌరవం ఇవ్వాలి. తదనుగుణంగా వారి నైపుణ్యం ఆధారంగా అవకాశాలను అందించాలి. ''ఎవరైనా సరే వారి విజయాల ఆధారంగా వ్యవహరించండి. సమాన బెంచ్‌మార్క్‌లను కలిగి ఉండండి'' అని ఆమె చెప్పారు.
బంధువులు కీలక పాత్ర పోషిస్తారు
ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ మంది మహిళలను పనిలోకి తీసుకువస్తుంది. అనేక టెక్ స్టార్టప్‌లు మహిళా ఉద్యోగులను నియమించుకోవాలని చూస్తున్నప్పటికీ స్టార్టప్‌లు అధిక రిస్క్‌గా పరిగణించబడుతున్నందున వారు సాధారణంగా పెద్ద సంస్థలలో పనిచేయడానికి ఇష్టపడతారని అభిలాష పేర్కొన్నారు. మహిళలు ఉద్యోగాలను ఎంచుకునేలా ప్రోత్సహించడంలో బంధువులు, స్నేహితులు కీలకపాత్ర పోషిస్తారని మేఘా అభిప్రాయపడ్డారు. టెక్ ఫీల్డ్ సాధారణంగా ప్రజలు ఎక్కువ గంటలు పని చేసే స్థలం అనే అపోహతో ముడిపడి ఉంటుంది. అందుకే ఇంట్లో వారు సాధారణంగా మహిళలను 'అనువైన ఉద్యోగాల' వైపు మళ్లిస్తారు. తద్వారా వారు ఇల్లు, పిల్లలు రెండింటినీ నిర్వహించగలరు.
మహిళలే ఇంట్లో ఉంటారు
ప్రస్తుత హైబ్రిడ్ వర్క్ పరిస్థితి వల్ల ఎక్కువ మంది మహిళలు పనిలోకి దిగుతున్నారా? ఫ్లెక్సిబిలిటీ, హైబ్రిడ్ వర్క్ కచ్చితంగా ఎక్కువ మంది తల్లులను వర్క్‌ఫోర్స్‌లోకి తీసుకువస్తుందని మధురిమ చెప్పారు. ''మీరు మీ బిడ్డను ఇంటి వద్ద వదిలి పని కోసం వెళ్లవలసి వస్తే తల్లిదండ్రుల్లో ఒకరు ఇంట్లో కచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ పరిస్థితుల్లో మహిళలే ఇంట్లో ఉంటారు'' అని ఆమె వివరించింది.
మీ గుర్తింపును ఎప్పటికీ కోల్పోకండి
''టెక్ మొదటి సారి ఏదో చేయాలని ప్రయత్నిస్తోంది. మీరు గోడను ఢకొీట్టే అవకాశం ఉంది. మీరు కాస్త కఠినంగా ఉండాలి'' అని ఆమె చెప్పారు. సాంకేతిక రంగం ఇతర రంగాల కంటే ఎక్కువ రిమోట్ ఉద్యోగాలను కలిగి ఉంది. మేఘా మాట్లాడుతూ ఇది మీ గట్ ఫీలింగ్ ఆధారంగా రిస్క్ తీసుకోవడమే. మహిళలు తమ గుర్తింపును ఎప్పటికీ కోల్పోకూడదని, వారికి నిజంగా సంతోషాన్నిచ్చే విషయాల కోసం వెళ్ళాలని ఆమె అన్నారు.
సహాయం కోరడం బలహీనం కాదు
''మీరు సహాయం కోసం అడిగినప్పుడు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న తగినంత మంది మంచి వ్యక్తులు ఉన్నారు. సహాయం కోరడాన్ని బలహీనతగా చూడకూడదు'' అని మధురిమ చెప్పారు. మహిళలు తమ కంటే తమను ఎక్కువగా నమ్మే వ్యక్తిని గుర్తిస్తే అది దీర్ఘకాలంలో వారికి సేవ చేసే నిధి అని అన్నారు.
- సలీమ