Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోత పెరుగుతోంది. ఈ సమయంలో ఎవరికైనా చెమట పడుతుంది. కానీ కొందరికి మాత్రం విపరీతంగా చెమట పడుతుంది. ఆ చెమటతో బట్టలు కూడా తడిసిపోతాయి. అలాంటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వేసవిలో చెమట పట్టడం సాధారణమైన విషయమే. కానీ మరీ ఎక్కువగా పడితే.. చికాకుగా ఉంటుంది. మరి వేసవిలో అధిక చెమట సమస్యలకు ఎలా చెక్ పెట్టాలి? ఈ వంటింటి చిట్కాలను పాటిస్తే సరిపోతుంది? చెమట నుంచి ఉపశమనం పొందవచ్చు.
- ఒక గ్లాసు నీటిలో యాపిల్ సైడర్ వెనిగర్ కలపండి. అందులో కాటన్ బాల్‌ను ముంచి దానితో గొంతు, చంకలు, చేతులు, అరికాళ్లకు మర్దన చేయాలి. రాత్రి నిద్రపోయే ముందు ఇలా చేయాలి. ఉదయం నిద్రలేవగానే స్నానం చేయాలి. ఇలా చేస్తే శరీరానికి ఎక్కువ చెమట పట్టదు.
- టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అవి శరీరంలో ఉన్న మలినాలను బయటకు పంపిస్తాయి. ఒక వారం రోజులు ప్రతి రోజు గ్లాస్ టమాటా రసం తాగాలి.
- ఆహారం మసాలాలు, కారం, నూనె ఎక్కువగా ఉండకుండా జాగ్రత్తపడాలి. వేసవిలో ఇలాంటి పదార్థాలు ఎక్కువగా తింటే శరీరం నుంచి ఎక్కువ నీరు బయటకు వెళ్తుంది. అందుకే ఎక్కువగా చెమట వస్తుంది.
- ఉప్పు ఎక్కువగా తిన్నా చెమట ఎక్కువగా వస్తుంది. అందుకే వేసవిలో ఉప్పును మరిమితంగానే తీసుకోవాలి. ఎంత తగ్గిస్తే అంత మంచిది.
- అధిక ఒత్తిడి, ఆతురత, టెన్షన్ ఎక్కువగా ఉన్నా... చెమట అధికంగా వస్తుంది. అందుకే ప్రతి రోజు ధ్యానం చేయాలి. శ్వాస ఎక్సర్సైజ్లు చేయడం ద్వారానూ చెమట సమస్యకు చెక్ పెట్టవచ్చు.