Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాధారణంగా చర్మ, జుట్టు సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అయినప్పటికీ అనేక సార్లు చర్మం, జుట్టుకు సంబంధించిన సమస్యలు రావడం సాధారణం. పీరియడ్స్ సైకిల్ కూడా ఈ సమస్యలకు ఓ కారణం. ఈ సమయంలో అనేక చర్మ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. నిజానికి పీరియడ్స్ సమయంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల ఆరోగ్యంతో పాటు మొటిమలు, పొడిబారడం, అదనపు నూనె, డల్ నెస్ వంటి సమస్యలు కూడా చర్మంపై కనిపిస్తాయి. అయితే ఆ సమయంలో కొన్ని సులభమైన చిట్కాల సహాయంతో ఈ సమస్యల నుండి బయటపడవచ్చు. ఆ ప్రత్యేక చర్మ సంరక్షణ చిట్కాల గురించి తెలుసుకుందాం.
పెట్రోలియం జెల్లీ ఉపయోగించండి: పీరియడ్స్ సమయంలో చర్మంలో తేమ శాతం తరచుగా తగ్గిపోతుంది. దీనివల్ల కొంతమంది మహిళల చర్మం పొడిగా, నిర్జీవంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో ప్రతి రాత్రి పడుకునే ముందు చర్మంపై పెట్రోలియం జెల్లీని అప్లై చేయడం ద్వారా పొడి బారడం నుండి బయటపడవచ్చు.
అలోవెరా జెల్: పీరియడ్స్ సమయంలో చర్మం జిడ్డుగా మారినట్లయితే అలోవెరా జెల్ లేదా గ్రీన్ టీని క్రమం తప్పకుండా చర్మంపై అప్లై చేయడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఇది అదనపు నూనెను గ్రహించడం ద్వారా చర్మాన్ని పున రుద్ధరించడంలో సహాయపడుతుంది.
అరోమాథెరపీ: పీరియడ్స్ సమయంలో ఆ క్రాంప్స్ చర్మంపై కనిపించడం ప్రారంభిస్తాయి. అటువంటి పరిస్థితిలో స్నానం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా నూనెను వేయడం వల్ల తాజా అనుభూతి చెందడంమే కాకుండా, మీ మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. దీని కోసం మీరు లావెండర్, శాండల్‌వుడ్, లెమన్ ఆయల్ వీటిలో ఏదైనా నూనెను ఎంచుకోవచ్చు.
మేకప్ వద్దు: పీరియడ్స్ సమయంలో చర్మం చాలా సున్నితంగా మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో మేకప్ వేసుకోవడం వల్ల చర్మంలో పగుళ్లు రావడం ప్రారంభమవుతాయి. కాబట్టి ఆ సమయంలో చర్మంపై సౌందర్య సాధనాల వాడకాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. కావాలంటే సేంద్రీయ ఉత్పత్తులను ఉపయోగించవచ్చు.
మసాజ్ చేస్తే నీరసం తొలగిపోతుంది: పీరియడ్స్ సమయంలో చర్మం తరచుగా నిస్తేజంగా మారే అవకాశం ఉంది. ఈ సమయంలో మాయిశ్చరైజర్, ఔషదం లేదా కొన్ని రకాల నూనెతో ముఖాన్ని మసాజ్ చేయవచ్చు. ఇది ముఖాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఇది ఉబ్బరం తగ్గిస్తుంది, చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తుంది.