Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దక్షిణ భారతదేశంలోని చాలా ప్రాంతాలలో బిర్యానీ అనేది ప్రధానమైన రుచికరమైన ఆహారం. దిండిగల్ తాళ్లప్పకట్టి బిరియానీ బ్రాండ్ అనేది నిజంగా ఎన్నో పరీక్షలకు నిలిచిన ఒక పేరు. ఎంతో మంది ఇష్టంగా తింటారు. కుటుంబం మొత్తం కలిసి నిర్వహించే ఈ వ్యాపారం తాళ్లప్పకట్టి బిరియాని బ్రాండ్ 1957లో తమిళనాడులోని ఒక చిన్న పట్టణంలో ప్రారంభించబడింది. నేడు ఇది ఓ గ్లోబల్ బ్రాండ్. దాని కస్టమర్లు అనేక ప్రాంతాల్లో ఉన్నారు. ప్రస్తుతం దీని బాధ్యతలు చూస్తున్నది దీపికా నాగసామి. దీని ద్వారా ఎంతో మందికి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. సాధికారత సాధించేలా సహకరిస్తున్నారు. తమ బ్రాండ్ ఇంతగా వృద్ధి చెందడానికి, పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి తాము తీసుకున్న చర్యల గురించి ఆమె ఏం చెప్తున్నారో తెలుసుకుందాం...
దీపికా నాగసామికి ఈ వ్యాపారంలోకి రావడం పెండ్లి తర్వాతనే జరిగింది. సతీష్.డి నాగసామి భార్య అయిన దీపిక పది సంవత్సరాలకు పైగా వ్యాపారంలో ముఖ్యమైన భాగంగా ఉంది. ఫుడ్ బ్రాండ్‌కు బలమైన బ్రాండింగ్, మార్కెటింగ్‌లో మంచి గుర్తింపు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
తమకంటూ ఓ సొంత రుచికై
హెర్స్టోరీస్ ఉమెన్ ఆన్ ఎ మిషన్ సమ్మిట్‌లో జరిగిన ఇంటరాక్షన్‌లో దీపిక తమ కుటుంబ వ్యాపారంలో భాగమైన తన ప్రయాణం గురించి మాట్లాడింది. లెగసీ బిజినెస్‌లో చేరడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, కానీ వాటితో పాటు ఎన్నో సవాళ్లు కూడా ఉన్నాయని ఆమె చెప్పారు. స్వీట్ స్పాట్ సంప్రదాయంతో సన్నిహితంగా ఉండటానికి, తమకంటూ ఓ సొంత రుచిని తీసుకురావడం కోసం ఎంతో శ్రమించాల్సి వచ్చిందని ఆమె అన్నారు.
లెగసీ బ్రాండ్‌లో చేరడం
లెగసీ బ్రాండ్‌లో చేరడం అనేది సెట్ నియమాలు, మార్గదర్శకాలతో వస్తుంది. కొత్త, విభిన్నమైన వాటిని ప్రయత్నించడానికి, సృష్టించడానికి మనల్ని అనుమతించడానికి ప్రజలకు సమయం పడుతుంది. ఎవరికైనా మనపై నమ్మకం రావాలంటే కచ్చితంగా కాస్త సమయం పడుతుంది అని దీపిక చెప్పారు. ఆమెకు తమ కుటుంబ వ్యాపారంలో చేరడం చాలా సాధారణ విషయం. బట్టల వ్యాపార నేపథ్యం నుండి వచ్చిన దీపిక యుఎస్, యుకెలలో ఉద్యోగం చేశారు. వివాహం తర్వాత ఆమె చెన్నైకి వచ్చేశారు.
ఖాళీగా ఉండలేకపోయా
''నేను నా సొంత ఫర్నీచర్ వ్యాపారం చేస్తున్నపుడు నేను గర్భవతిని. అందుకే సెలవు తీసుకోవలసి వచ్చింది. కానీ నేను నిశ్చలంగా ఉండలేకపోయాను. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు నేను బ్రాండింగ్, మార్కెటింగ్‌పై సలహాలు ఇస్తూ ఉండేదాన్ని. మెనూలు ఎలా తయారు చేయబడతాయో, రంగు పథకాలు గురించి తాళ్లప్పకట్టికి ఇన్పుట్లు ఇచ్చేదాన్ని. అటువైపు పూర్తి సమయం ఎప్పుడు వెళ్లానో చెప్పలేను. ఇది క్రమంగా జరిగే ప్రక్రియ. సతీష్ వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చినప్పుడల్లా నేను నా ఇన్పుట్లను ఇచ్చేదాన్ని. అలా నేను నెమ్మదిగా మార్కెటింగ్ వ్యవహారాలను చూడడం ప్రారంభించాను'' అని దీపిక చెప్పారు.
మహిళా బృందాన్ని నిర్మించడం
ఆఫీసులో తను మొదట ఏకైక మహిళగా ఉండేది. తను వ్యాపారంలో చేరినప్పటి నుండి దీపికా జట్టులో ఎక్కువ మంది మహిళలు ఉండేలా చూసుకున్నారు. నేడు తాళ్లప్పకట్టి జట్టులో దాదాపు 35 శాతం మంది మహిళలు ఉన్నారు. ''కానీ నేను మొదట్లో కొన్ని సంవత్సరాలు అంత చురుకుగా పని చేయలేదు. జట్టులోని ఒక మహిళగా నన్ను మిగిలిన వారు అంగీకరించేలా చేయడం నా మొదటి కర్తవ్యం. ఇది వేర్వేరు వ్యక్తులతో కూడుకున్న జట్టు. ఈ జట్టులో చెఫ్‌లు, కూరగాయలు కత్తిరించే వ్యక్తులు ఇలా వేర్వేరుగా ఉంటారు. వారి మద్దతు పొందడమంటే మామూలు విషయం కాదు. హెచ్ఆర్. ఫంక్షన్లు పూర్తిగా పురుషుల ఆధిపత్యంలో ఉంటాయి. అందుకే నేను ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఇలాంటి ఫంక్షన్లకు పని చేసేందుకు మహిళలు కూడా ఉన్నారని, వారు కూడా అని చేయగలరనే నమ్మకం తీసుకొచ్చే ప్రయత్నం చేశాను'' అని దీపిక వివరించారు.
మహిళలు నిజాయితీగా ఉంటారు
హెచ్ఆర్లోకి ఒక మహిళను జట్టు ప్రవేశించేలా చేయడం, అకౌంటింగ్ వంటి ఇతర బృందాలను తీసుకురావడం ప్రారంభించింది. దీపికకు అనుకూలంగా పనిచేసిన విషయం ఏమిటంటే మహిళలు నిజాయితీగా పని పచేస్తారనే పేరు ఉంది. ముఖ్యంగా అకౌంటింగ్ విభాగంలో. ''నేను దానిని నా ప్రయోజనం కోసం ఉపయోగించాను. మేనేజ్మెంట్ టీమ్‌లో 32 నుంచి 35 శాతం మంది మహిళలు ఉన్నామని ఇప్పుడు నేను గర్వంగా చెప్పగలను.
ఆలోచనలను బద్దలు కొట్టాలి
''మీరు ఈ వ్యాపారం ఎందుకు చేస్తున్నారని అని నన్ను ఎంతో మంది అడిగిన సందర్భాలు ఉన్నాయి. మీరు పిల్లలను చూసుకుంటూ ఇంట్లో ఉండకూడదా? ఇది మగవారు చేసే పని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను ఇలాంటి ఆలోచనలను బద్దలు కొట్టాలనుకున్నాను. ఈ వివక్షా పూరితమైన మాటలను విచ్ఛిన్నం చేసేందుకు పోరాటం చేయడం నాకు ఎంతో ఇష్టం'' అని దీపిక అన్నారు.
నెమ్మదిగా మార్చడానికి
మార్పు నెమ్మదిగా ఉన్నప్పటికీ ఇది స్వాగతించదగిన మార్పు. ఇక అక్కడి నుంచి మిగతాదంతా చరిత్రే. ప్రక్రియపై దృష్టి సారించడం, విషయాలను నెమ్మదిగా మార్చడానికి సహాయపడింది. ''ఏదీ ఎప్పుడూ పూర్తిగా అంతం కాదు. ప్రతిదీ ఎల్లప్పుడూ పురోగతిలోనే ఉంటుంది'' అని దీపిక జోడించారు.
మీకు నమ్మకం ఉంటే చాలు
మనం చేయాల్సిన పనిని ఎంచుకోవడానికి పోరాటం చేయాలి. దీనికోసం విభిన్న అభిప్రాయాలను అర్థం చేసుకోవడం చాలా అవసరమని ఆమె వివరిస్తున్నారు. ''మీరెలా ఉండాలనుకుంటున్నారో అలాగే ఉండండి. ఇతరులు ఏమి చెప్పినప్పటికీ మీరు చేయాలనుకున్న దానిపై మీకు స్పష్టత ఉండి నమ్మకం ఉంటే దాన్నే విశ్వసించండి. దాన్ని చేయండి. మీకు మీరే మద్దతు ఇచ్చుకోవాలి తప్ప. మీకు మద్దతు ఇచ్చే మరో వ్యవస్థ సమాజంలో లేదు. మీెరు దానిని పొందగలిగితే మిగతా వారందరూ మిమ్మల్నే అనుసరిస్తారు. అనివార్యంగా మిమ్మల్ని ముందుకు నెట్టివేస్తారు'' అంటారు ఆమె.