Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన శరీరమే మన ఆరోగ్యాన్ని, జీవిత కాలాన్ని పెంచుతుందనేది అక్షర సత్యం. ఇక మన చర్మం మనలోని భావుకతని, అందాన్ని ప్రతిబింబిస్తుంది. వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం.. ఏదైనా సీజన్ మారుతున్న కొద్దీ శరీరం మార్పులకు గురవుతూ ఉంటుంది. చర్మాన్ని ఎక్కువగా రక్షించుకోవాల్సిన సమయాలు ఇవి. చాలామందికి బయటి వాతావరణం ఆహ్లాదంగా కనిపించినా చర్మంలో వచ్చే మార్పులు చూసి తట్టుకోలేరు. ఈ రోజుల్లో మధ్యాహ్నం ఎండ బాగా ఉంటుంది. బయటికి వెళ్లి తిరిగి వస్తే చర్మం నల్లబడుతుంది. మెరుపు దూరమవుతుంది. బాహ్య చర్మ సంరక్షణ చాలా కీలకమవుతుంటుంది. సహజంగా ఎదురయ్యే సమస్య వల్ల చర్మం పగలడం లేదా పొడి బారి.. దురద రావడం, ముఖంపై ముడతలు రావడం వంటి సమస్యలు వస్తుంటాయి. పగటి పూట ముఖ్యంగా ఎండలో ఎక్కువగా తిరగడం వలన కూడా అధిక వేడితో చర్మంపై ముడతలు ఏర్పడతాయి. చర్మంపై తేమ చర్మ సౌందర్యానికి చాలా ముఖ్యం. కాబట్టి సహజసిద్ధమైన చర్మం కోసం నీటిని తగిన మోతాదులో తాగాలి. అలాగే మంచి జ్యూస్‌లు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం..
- రోజు బొప్పాయి జ్యూస్ తాగిన, ఒక కప్పు బొప్పాయి ముక్కలను తిన్న చర్మ సౌందర్యం మెరుగు పడుతుంది. బొప్పాయిలో అధిక మొత్తంలో ఉండే విటమిన్ సి చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది.
దానిమ్మ గింజలలో అధిక మొత్తంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి కావలసిన పోషకాలను అందించి చర్మంలో పేరుకుపోయిన మతకణాలను తొలగిస్తాయి. చర్మాన్ని శుభ్రపరిచి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చర్మంపై ఏర్పడే మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది. రోజు దానిమ్మ జ్యూస్ తాగితే మంచి ఫలితం ఉంటుంది.
- చర్మం ముడుతలు పడకుండా టైట్‌గా ఉంచే కొలాజిన్‌ను ఉత్పత్తిని పెంచడంలో నారింజ జ్యూస్ సహాయపడుతుంది. ముఖంపై ఏర్పడే వద్ధాప్య ఛాయలను తగ్గించడానికి సహాయపడుతుంది. మొటిమలు, మచ్చలు వంటి సమస్యలను తగ్గించి చర్మ నిగారింపు పెంచుతుంది.
- అప్పుడప్పుడూ చర్మానికి మసాజ్ చేయడం చాలా అవసరం. దీనివల్ల హాయిగా అనిపించడంతో పాటు చర్మానికి రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. మిగిలిన భాగాలతో పాటు ముఖానికి కూడా మసాజ్ చేసుకోవడం వల్ల ముఖం మెరిసిపోతుంది. ముఖంపై ఉన్న ముడతలు, మచ్చలు కూడా తగ్గే వీలుంటుంది. రక్త ప్రసరణ పెరగడం వల్ల మీ ముఖంపై ఎలాంటి మొటిమలు, ఇతర చర్మ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.