Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజులో ఒక్కసారి కూడా నిద్ర సరిగా పట్టనివారున్నారు. అయితే వీటన్నింటి కారణంగా సగటు మధ్య తరగతి మనిషిపై చాలా ఒత్తిళ్లు ఉంటాయి. నిత్యం బిజీబీజీ. చాలా మంది జీవన విధానం వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతుంటారు. దీని ప్రభావం వారి ఆరోగ్యంపై పడుతుంది. నిద్ర కూడా కరువు అవుతుంది. నిద్ర లేకపోవడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. ఏకాగ్రత లోపించడం వల్ల ఏ పని పూర్తి చేయలేకపోతుంటాం అని చాలా మంది కంప్లెయింట్స్ చేస్తుంటారు. అలాంటి వారు ఈ కింది చిట్కాలు పాటిస్తే చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది..
అలసట వచ్చే వరకు విశ్రాంతి: మీరు నిద్ర పోలేకపోతే మరొక గది లోకి వెళ్లి మీకు అలసట వచ్చే వరకు ఏదో ఒక పని చేయండి. పని సామగ్రి, కంప్యూటర్లు, టెలివిజన్లను నిద్రపోయే వాతావరణం నుంచి దూరంగా ఉంచటం మంచిది. మీకు ఒక నిర్దిష్ట కార్యాచరణ లేదా వస్తువు మీ నిద్రకు భంగం కలిగించినట్లు అనిపిస్తే, దాన్ని మీ నిద్ర వేళ దినచర్య నుండి తొలగించండి. అప్పటికీ మీకు ఇంకా నిద్ర సరిగా రాకుంటే డాక్టర్ని సంప్రదించడం మంచిది.
ఆహారంలో బాదం పప్పు, వాల్నట్స్: ప్రతి రోజు ఆహారంలో బాదం పప్పు, వాల్నట్స్ మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి. డ్రై ఫ్ఫ్రూట్లలో ఉండే మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, రాగి ఇవన్నీ అధిక కొవ్వును తగ్గిస్థాయి. అలాగే నిద్రకి అవసరమయ్యే మెలటోనిన్ అనే రసాయనం విడుదలకు సహకరిస్తాయి. నిద్రకు ఉపక్రమించే ముందు ఒక గ్లాసు పాలు తాగడం ఎంతో మంచిది. పాలల్లో ఉండే అమినో ఆసిడ్లు, ట్రైఫ్టోనీన్ వంటివి శరీరంలో సెరటోనిన్ విడుదల చేస్తాయి. ఇది నిద్రని ఉపక్రమించే ఒక రసాయనం. అందుకే నిద్రపోయే ముందు ఒక గ్లాస్ స్వచ్చమైన పాలు తాగితే నిద్ర త్వరగా వస్తుంది.
అరటి పండు తినండి: మనిషి ఆరోగ్యకరంగా జీవించడానికి రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. అలాగే మనం పడుకున్న తరువాత గాఢ నిద్రలో ఎంతసేపు ఉన్నాం అనేది చూసుకోవాలి. ఇటువంటి గాఢ నిద్ర పట్టాలంటే మన ఆహారంలో కొన్ని పదార్ధాలు తప్పని సరిగా తీసుకోవాలి. మన అందరికి విరివిగా దొరికే పండ్లలో అరటి పండ్లు కూడా ఒకటి. వీటిలో మెగ్నీషియం, పొటాషియం వంటివి మన కండరాలు రిలాక్స్ కావడానికి ఉపయోగపడతాయి. అరటిలో ఉండే కార్బోహైడ్రేట్ రక్తంలోని గ్లూకోజ్ తగ్గకుండా చేసి నిద్ర త్వరగా రావడానికి సహాయపడతాయి.