Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎండాకాలంలో చర్మంపై నల్ల మచ్చలు లేదా సన్ ట్యాన్ సాధారణ సమస్యలు. వడదెబ్బ వల్ల చర్మ సమస్యలు వస్తున్నాయి. ఇందుకు చాలా హోం రెమెడీస్ ఉన్నాయి.
- మొటిమల మచ్చలను తొలగించడంలో నిమ్మరసం అత్యంత ప్రభావవంతమైనది. నిమ్మరసంలోని విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. నిమ్మకాయలోని అసిడిక్ కంటెంట్‌తో సన్ ట్యాన్ మరకలు తొలగిపోతాయి.
- పసుపు చర్మానికి చాలా మంచి స్క్రబ్బర్. ఇది చర్మపు మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. అర టేబుల్ స్పూన్ పసుపులో రెండు టేబుల్ స్పూన్ల చిక్ పీస్ వేసి కొద్దిగా పాలు కలపాలి. దీనితో మీ ముఖాన్ని స్క్రబ్ చేయండి. కాసేపటి తర్వాత ఆరిపోతుంది. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
- రెండు టేబుల్ స్పూన్ల పచ్చి బొప్పాయి పేస్ట్ తీసుకోండి. దీన్ని ఒక టేబుల్ స్పూన్ పాలతో కలపండి. ఆ మిశ్రమాన్ని అప్లై చేయండి.
- ఓట్ మీల్, పెరుగును సమాన పరిమాణంలో తీసుకొని ముఖం మీద మిక్స్ చేసి 10 నిమిషాలు అలాగే ఉంచండి.
- టొమాటో చర్మానికి మంచి మెరుపునిస్తుంది. పసుపు, టమాటో రసాన్ని మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉంచండి.
- సన్ టాన్ నుండి బయటపడటానికి చందనం సహాయపడుతుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ప