Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా తర్వాత మారుతున్న జీవన శైలిలో చాలామంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. రెడీ మేడ్‌గా తినడానికి ఏది దొరికితే దానిని లాగించేస్తున్నారు. దీంతో అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. శరీరంలో వివిధ రకాల వ్యాధులకు కారణం.. తినే ఆహారం విషయంలో అశ్రద్ధ వహించడమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే శరీరంలో ముఖ్యమైన భాగాలు దెబ్బతినడమే కాకుండా.. పంటి సమస్యలు కూడా వేధిస్తుంటాయి. ఎక్కువగా చల్లటి పదర్ధాలు తీసుకున్నప్పడు జివ్వుమని.. పంటి నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఒక్కో సమయంలో దంతాలు పుచ్చి పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అలాంటి సమయంలో వైద్యులను తప్పనిసరిగా సంప్రదించాలి. అయితే వైద్యులు అందుబాటులో లేని సందర్భంలో పంటి నొప్పి ఎక్కువగా రాక ముందే.. చిన్న పాటి చిట్కాలను అనుసరించి ఆ నొప్పిని తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో తెలుసుకుందాం...
- కొన్నిసార్లు దంతాల్లో పేరుకుపోయిన వ్యర్థాల కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్ ద్వారా కూడా పంటి నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గోరు వెచ్చటి నీటిలో కాస్త ఉప్పు వేసి నోట్లో వేసుకొని బాగా పుకిలించాలి. దీంతో దంతాల చుట్టూ, మధ్య పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు పోతాయి. నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
- అప్పుడే కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కను నొప్పిగా ఉన్న పంటిపై ఉంచుకోవడం వల్ల అప్పటికప్పుడు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
- వెల్లుల్లి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక పంటి నొప్పిని తగ్గించడంలో వెల్లుల్లి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే యాంటి బయోటిక్ గుణాలు తీవ్రమైన పంటి నొప్పి నుంచి కూడా వెంటనే రిలీఫ్ అందిస్తుంది. వెల్లుల్లిని బాగా దంచి అందులో కొంచెం ఉప్పు లేదా మిరియాల పొడి కలిపి నొప్పిగా ఉన్న పంటిపై ఉంచితే ఫలితం ఉంటుంది.
- జామ ఆకుల గురించి అందరికీ తెలిసిందే. అందులో కూడా ఎన్నో ఔషధ గుణాలుంటాయి. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వలన పుండ్లు త్వరగా తగ్గుతాయి. వీటి యాంటీ మైక్రోబియల్ యాక్టివిటీ ఓరల్ కేర్‌లో కూడా హెల్ప్ చేస్తుంది. ఇలా చేయడానికి తాజా జామాకులు నమలండి లేదా కొన్ని జామాకులని కొద్దిగా దంచి వాటిని మరుగుతున్న నీటిలో వేసి మౌత్ వాష్ చేస్తే పంటి నొప్పి అనేది మాయం అయి పోతుంది.
- ఒకవేళ పంటి నొప్పి అనేది రెండు రోజుల కంటే ఎక్కువ ఉన్నా.. ఊపిరితీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నా.. వాపుగా ఉన్నా.. పంటినొప్పితో పాటు జ్వరం ఉన్నప్పుడు.. చిగుళ్లు ఎర్రగా ఉన్నప్పుడు మాత్రం పై చిట్కాలను వాడకూడదు. అలాంటి సమయంలో దంత వైద్యులను సంప్రదించడం చాలా మంచిది.