Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కండ్ల కింద, కంటి చుట్టూ ఉన్న చర్మంపై నల్లటి మచ్చలు లేదా వలయాలు రావడం సహజంగా మారింది. ప్రస్తుతం కాలంలో ఎంతోమందిని వేధిస్తోన్న సమస్య ఇది. ఎంత అందంగా ఉన్నా ఈ మచ్చలు అందాన్ని దెబ్బతీస్తున్నాయని నేటి యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది. పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా సహజంగానే ఇవి ఏర్పడుతున్నాయి. ఈ బ్లాక్ స్పాట్స్‌తో మీరు వయసులో పెద్దవారిగా కనిపిస్తారు. ఫలితంగా నిరాశ, నిస్పృహలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది.
రావడానికి కారణాలు: అతిగా నిద్రపోవడం, విపరీతమైన అలసట లేదా మీ సాధారణ నిద్ర వేళను దాటి కొన్ని గంటలపాటు పడుకోవడం వల్ల కండ్ల కింద నల్లటి మచ్చలు వస్తాయి. నిద్రలేమి చర్మాన్ని నిస్తేజంగా, లేతగా మారడానికి కారణమవుతుంది. ఇది చర్మం కింద ఉన్న నల్లటి కణజాలలు, రక్తనాళాలు కనిపించేలా చేస్తాయి. నిద్రలేమి వల్ల కండ్ల కింద ద్రవం ఏర్పడి అవి ఉబ్బినట్టు కనిపిస్తాయి. నిజానికి నల్లటి మచ్చలు ఉబ్బిన కనురెప్పల నుంచి వచ్చే నీడలు కావచ్చు.
నల్ల మచ్చలు ముఖంలో కాంతిని కోల్పోయేలా చేసి అంద వికారంగా కనిపిస్తుంటుంది. చాలా మందికి వయసు పైబడే కొద్ది ముఖంపై నల్ల మచ్చలు ఎక్కువగా వస్తుంటాయి. ఇవి నొప్పిని, బాధని అయితే కలిగించవు. కానీ ముఖంపై ఈ నల్లటి మచ్చల వలన చాలామంది మానసికంగా కుంగిపోతుంటారు. ఎలా ఈ నల్లమచ్చలను పోగొట్టి అందంగా కనిపించాలి అని ఆలోచిస్తుంటారు. అలాంటి వారు ఈ చిట్కా పాటిస్తే సరిపోతుంది.
బియ్యం పిండి చర్మంపై మొటిమలు, మచ్చలు, ముడతలను తగ్గించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఇది చర్మానికి బ్లీచ్‌గా, స్క్రబ్‌గా సహాయపడి చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.
- ఒక కప్పులో బియ్యం పిండి, కలబంద గుజ్జు, తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గిపోయి చర్మానికి మంచి నిగారింపు అందుతుంది. మృతకణాలు తొలగిపోతాయి.
- ఒక కప్పులో బియ్యం పిండి, బాగా పండిన అరటి పండు గుజ్జు, ఆముదం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని కండ్ల కింద ఏర్పడిన డార్క్ సర్కిల్స్లపై అప్లై చేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ డార్క్ సర్కిల్స్‌ను తగ్గించి కండ్ల కింద చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.