Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేసవిలో ప్రత్యేకంగా అనేక రకాల పండ్లు, కూరగాయలు మనకు అందుబాటులో ఉంటాయి. అందులో పుచ్చకాయలు, గింజలు, మామిడిపండ్లు చాలా ప్రసిద్ధి చెందిన వేసవి పండ్లు. ఇవి చల్లదనాన్ని ఇచ్చే నీరు, పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. చలికాలంలో పండించే చెరకు వేసవి ఎండల తాకిడిని తగ్గించడంలో ఎంతగానో సహకరిస్తుంది. వేడిగా ఉన్న రోజుల్లో ఎంత నీరు తాగినా దాహం తీరదు. దాంతో చాలా మంది నీరు కాకుండా సహజసిద్ధమైన పానీయాలను ఇష్టపడతారు. వీటిలో అత్యంత ప్రజాదరణ పొందినది చెరుకు రసం.
- నిమ్మ, అల్లంతో చేసిన చెరుకు రసం ఒకటి లేదా రెండు గ్లాసుల తాడం వల్ల ఎండ వేడి, ఉడకపోత తగ్గుతుంది. చెరకు రసం రుచికరమైన, సూర్యరశ్మికి అనుకూలమైన శీతల పానీయం మాత్రమే కాదు. ఇది ఐరన్, ఎలక్ట్రోలైట్స్, యాంటీ ఆక్సిడెంట్స్‌తో కూడిన పోషకాలతో నిండి ఉంటుంది. ఏదైనా సీసా లేదా ప్యాకెట్లో వచ్చే పానీయాలు తాజాగా తయారు చేసిన చెరకు రసానికి సరితూగవు. చెరకు రసం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
- అలసటగా లేదా బలహీనంగా అనిపిస్తే చెరకు రసం తాగితే వెంటనే శక్తిని పొందవచ్చు. ఇది సహజ స్వీటెనర్లను కలిగి ఉంటుంది. ఇనుము కలిగి ఉండి తక్షణ శక్తిని ఇస్తుంది. అదనంగా చెరకు రసం డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది. ఇందులో ఎలక్ట్రోలైట్ ఉంటుంది. వేసవిలో తీవ్రమైన నీటి పోషకాహార లోపం ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి బాగా దాహం వేసినా లేదా డీహైడ్రేషన్‌కు గురైనట్టు అనిపించినా రోజూ చెరుకు రసం తాగవచ్చు.
- ఇది శరీరం నుండి అనవసరమైన నీటిని బయటకు పంపేందుకు సహకరిస్తుంది. చెరుకు రసం తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు నీరు, ఉప్పు మూత్రం ద్వారా విసర్జించబడతాయి. ఇది వేసవిలో ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.
- చెరుకు రసం చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. చెరకు రసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో ఉండే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. కణాలను పునరుజ్జీవింపజేస్తుంది. వృద్ధాప్య సంకేతాలను నివారిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది.
- చెరకు రసంలో మెగ్నీషియం, ఐరన్ వంటి ఇతర ఖనిజాలు ఉన్నాయి. ఇవి పోషకాహార లోపాన్ని సరిచేయడంలో సహాయపడతాయి. శరీరంలో రక్తం, ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ప్రస్తుత వాతావరణంలో చాలా చోట్ల చెరుకు బండ్లు ఉన్నాయి. అందువల్ల సులభమైన, సరసమైన సహజ పానీయమైన చెరకు రసం తాగడం వల్ల వడదెబ్బ ప్రభావాలను తగ్గించుకోవచ్చు.