Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పరీక్షలకు ముందు చదివింది గుర్తుంచుకోవడానికి, మీ పిల్లల ఏకాగ్రతను పెంచడానికి ఈ చిట్కాలు పాటించండి.
అనువైన వాతావరణం: సరైన అధ్యయన వాతావరణం విద్యార్థులు దృష్టి కేంద్రీకరించడానికి, వారి అభ్యాస సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తగినంత వెంటిలేషన్, లైటింగ్ ఉన్న గదులు ఉండాలి. తద్వారా వారు ప్రశాంతంగా చదువుకోవచ్చు.
ఆకాంక్షలను సెట్ చేయండి: వారి సామర్థ్యం, ప్రాధాన్యతల ఆధారంగా లక్ష్యాలను నిర్ణయించుకోవాలి. సాధించలేని లక్ష్యాలపై పని చేయడానికి బదులుగా, వాస్తవిక లక్ష్యాలను కలిగి ఉండటం వారిని ప్రేరేపించేలా చేస్తుంది.స్వల్పకాలిక లక్ష్యాలకు కట్టుబడి, చక్కగా ప్రణాళికాబద్ధమైన అధ్యయన షెడ్యూల్ని ఉపయోగించి వాటి కోసం పని చేయండి. ఇది లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడుతుంది.
వ్యాయామం: శారీరక శ్రమ ఆందోళనల నుండి ఉపశమనం చేస్తుంది. శారీరక, మానసిక వ్యాయామం ఒత్తిడిని దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.
చర్చించండి: రోజు పాఠాలను సమీక్షించడం వల్ల ఎక్కువ కాలం వాటిని గుర్తుంచుకోవచ్చు. ఇవి కాకుండా చర్చలు కూడా అవసరం.