Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రంజాన్ మాసంలో ముస్లింలు ఉదయం నుండి రాత్రి వరకు ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాసాన్నే రోజా అంటారు. ఈ సమయంలో వారు పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోరు. సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే సమయంలో ఇఫ్తార్‌తో ఉపవాసాన్ని విరమిస్తారు. అయితే రంజాన్ మాసంలో కఠిన ఉపవాసాలు పాటించేటప్పుడు నోరూరించే డిషెస్‌తో పాటు ఆరోగ్యాన్ని కాపాడే రుచికరమైన సమతుల్యతను పాటించే ఫుడ్ కూడా తప్పకుండా తీసుకోవాలి. సరైన పోషకాలను ఎంచుకోవడంతో పాటు కేలరీస్ పెరగకుండా హెల్దీ డైట్ పాటించడం కూడా చాలా ముఖ్యం అంటున్నారు న్యూట్రీషన్లు.
ఇఫ్తార్ సమయంలో ఎలాగో చాలామంది ఖర్జూరాలు తిని ఉపవాసం విరమిస్తారు. అయితే ఆ సమయంలో ఖర్జూరాలను ఇలా తింటే బెటర్ అని చెబుతున్నారు. ఖర్జూరాలను తీసుకొని వాటిని మధ్యలో కట్ చేసి లోపల ఉండే సీడ్స్‌ను తొలగించాలి. ఆ తర్వాత పీనట్ బటర్‌తో ఖర్జూరాలను స్టఫ్ నింపాలి. ఆ తర్వాత మీకు నచ్చిన కొన్ని నట్స్ తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వాటిని పీనట్ బటర్‌తో నింపిన ఖర్జురాలపై నింపాలి. ఖర్జూరాలను డార్క్ చాక్లేట్తో కోట్ చేసి వాటిని ఒక రాత్రంతా ఫ్రిజ్‌లో పెట్టాలి. మరుసటి రోజు వాటిని సర్వ్ చేసి తింటుంటే ఖర్జూరం ఫ్లేవర్స్‌లో వచ్చే టెస్ట్ మనకు తెలుస్తోంది.
ఖర్జూరంలో ఫైబర్, వ్యాధులపై పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. పీనట్ బటర్ గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో, శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. డార్క్ చాక్లెట్ యాంటీఆక్సిడెంట్ల శక్తివంతమైన మూలం. రక్తపోటును నియంత్రించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.