Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేసవిలో కొబ్బరినీరు అనివార్యమైన అవసరం. ఇది ఎండ వేడిని తట్టుకునే సహజమైన నీరు. ''వేసవి కాలంలో శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ హైడ్రేషన్ ద్వారా విడుదలవుతాయి. శరీరాన్ని తిరిగి నింపడానికి జ్యూస్ సరైన మార్గం. శరీరానికి పొటాషియం, సోడియం, కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాల ద్వారా ఎలక్ట్రోలైట్లు లభిస్తాయి'' అని పోషకాహార నిపుణులు ప్రీతి రాజ్ చెప్పారు.
- కొబ్బరినీరు తాగేటప్పుడు కేవలం నీళ్లు తాగడమే కాకుండా కొబ్బరిని కూడా తినాలని ప్రీతి అంటున్నారు. ఈ నీటిలో పొటాషియం, కాల్షియం ఉన్నప్పటికీ లేతకొబ్బరిలో ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఉదాహరణకు శరీరానికి అవసరమైన కొవ్వులు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ఇందులో విటమిన్లు, ఎనర్జీ న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. విదేశాల్లో లేతకొబ్బరిని కూడా తింటారు.
- ఈరోజుల్లో చాలా మందికి పొటాషియం లోపం వల్ల గుండె సమస్యలు, అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి. దీన్ని నివారించాలంటే రోజూ కొబ్బరినీరు తాగడం మంచిది.
- హేమోరాయిడ్స్ ఉన్నవారికి కాల్షియం, పొటాషియం చాలా అవసరం. వీరికి కూడా ఈ నీరు మంచి ఔషధం అవుతుంది.
- గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉంటే కొబ్బరినీరు తాగొచ్చు. ఏవైనా శారీరక సమస్యలు ఉంటే తగిన మందులు వాడుతుంటే ప్రసూతి వైద్యనిపుణుల సలహా మేరకు తాగవచ్చని ప్రీతి చెప్పింది.
- కిడ్నీ వ్యాధి ఉన్నవారు తాగకూడదు. అలాగే నీరు ఎక్కువగా తీసుకోకూడదని ఆంక్షలు ఉన్నవారు, పాదాల వాపు సమస్యలు, నట్స్ వల్ల అలర్జీ, గుండె సమస్యలు ఉన్నవారు, పొటాషియం, సోడియం తీసుకోవడంపై పరిమితులు ఉన్నవారు కొబ్బరినీరు తాగడం మానుకోవాలి.
- రోజుకు ఒక కొబ్బరి బోండాను మాత్రమే తాగాలి. గరిష్ఠంగా 250 - 300 ఎంఎల్ల వరకు నీటిని తీసుకోవచ్చు. అతిగా తాగడం వల్ల శరీరానికి కావాల్సిన పొటాషియం, కార్బోహైడ్రేట్లు పెరుగుతాయి. అప్పుడు దుష్ప్రభావాలు ఉంటాయి.