Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రంజాన్ మాసంలో ప్రత్యేకంగా తయారుచేసే ఇఫ్తార్ ప్రత్యేక వంటకాల ఎన్నో ఉన్నాయి. నోరూరించే రుచులతో అనేక రకాల డిషెస్ ఉన్నాయి. అయితే ఎన్ని వంటకాలు ఉన్నా.. మండే వేసవిలో రోజా పాటించేటప్పుడు సాయంత్రం చల్లటి నీళ్లు తాగితే ఆ తృప్తే వేరు. ఈ వరుసలో ఓ మంచి డ్రింక్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఆ డ్రింక్‌ను తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య కరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అదే రూ అప్జా. చాలామంది ఇళ్లలో ఈ డ్రింక్ గురించి తెలిసే ఉంటుంది. అయితే ఈ రంజాన్ మాసంలో వేడిని అధిగమించి, రుచికరమైన, ఆరోగ్యకరమైన ఈ పానీయంను ఒక్క సిప్ చేసి ఉపవాసాన్ని ముగిస్తే ఎన్నో ప్రయోజనాలు. ఇప్పుడు రూ అప్జాను ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం.
- ఒక పెద్ద బౌల్‌ను తీసుకొని అందులో నిమ్మరసం, ఉప్పు, బ్లాక్ సాల్ట్, రోజ్ సిరప్, మిరియాల పొడి, పుదీనా ఆకులు, ఐస్ క్యూబ్స్ జోడించండి. నానబెట్టిన చియా విత్తనాలను అందులో వేయండి. ఒకవేళ మీకు చియా సీడ్స్ అందుబాటులో లేకుంటే దానికి బదులుగా సబ్జా లేదా తులసి గింజలను కూడా ఉపయోగించవచ్చు. చిల్‌గా ఉన్న సోడా వాటర్‌ను కూడా పైన వేయండి. ఆ తర్వాత దాన్ని బాగా కలిపి అందరికీ సర్వ్ చేస్తే చాలు.. మండే ఎండలో చల్ల చల్లని రూఅప్జా రెడీ.
- రూ అప్జాతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరంలోని డీహైడ్రేషన్ నుండి ఉపశమనం పొందడంలో, హిమోగ్లోబిన్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది అజీర్ణాన్ని నివారించడంతో పాటు శరీర వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా జ్వరాన్ని తగ్గిస్తుంది. రూఅఫ్జా గుండె సామర్థ్యాన్ని పెంచడంలో, గుండెలో రక్త సరఫరాను సున్నితంగా చేయడంలో కూడా సహాయపడుతుంది. తద్వారా మొత్తం హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వికారం, విరేచనాల లక్షణాలను తగ్గించడానికి రూ అఫ్జా తీసుకోవచ్చు. ఇంకెదుకు ఆలస్యం ఇవాళ ఇఫ్తార్‌కు చల్లటి రూ అప్జా తయారు చేసేయండి. ఇంట్లో అందరికీ సర్వ్ చేసి హెల్త్‌తో పాటు టేస్ట్‌ను కూడా అస్వాదించండి.