Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముఖంపై ఉన్న నల్ల మచ్చలను తొలగించడంలో బొప్పాయి చాలా మేలు చేస్తుంది. బొప్పాయిని అనేక యాంటీ-పిగ్మెంటేషన్ క్రీమ్లలో, మాస్క్‌లలో కూడా ఉపయోగిస్తారు. ఈ ఫేస్ ప్యాక్‌లో ఉండే ఎంజైమ్ వల్ల ముఖంపై మచ్చలు తొలగిపోతాయి. దీనికోసం బొప్పాయిని బాగా పేస్ట్ చేయండి. దీన్ని ముఖానికి రాత్రంతా పట్టించి, ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడగాలి. వారానికి రెండు మూడు రోజులు ముఖానికి ఈ బొప్పాయి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఇది ముఖంపై మచ్చలను పోగొట్టి, చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.