Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరుకు చెందిన ప్రియా శర్మ... లెర్నింగ్ డినో పేరుతో రెండు నుండి ఆరు సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలకు కార్యకలాపాలు, విద్యా బొమ్మల ద్వారా వారిలో ఉత్సుకతను రేకెత్తించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మహిళా వ్యాపారవేత్త అసలు పిల్లల కోసం ఎడ్యుకేషనల్ టార్సు ప్లాట్‌ఫారమ్‌ను ఎందుకు ప్రారంభించాలనుకుందో, దానికి గల కారణాలేంటో తెలుసుకుందాం...
ప్రియా శర్మ తన బిడ్డకు జన్మ నిచ్చే సమయంలో ప్రసూతి సెలవుతు తీసుకుంది. ఆ సెలవులు ముగింపు దశకు చేరుకున్నాయి. తిరిగి తన ఉద్యోగాన్ని పునఃప్రారంభించడానికి సిద్ధమవుతున్నప్పుడు ఆమె మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేసిన కంపెనీ సెలవును పొడిగించమని కోరింది. ఇది 2020 ప్రారంభంలో జరిగిన సంఘటన. ఆ సమయంలో కంపెనీ కోవిడ్-19 నేపథ్యంలో అనిశ్చితితో పోరాడుతూ వ్యక్తులను తొలగిస్తోంది. దాంతో ప్రియా తన పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకుంది.
పిల్లలకు ప్రశ్నలు పుడతాయి
వర్చువల్ పాఠశాల విద్య నడుస్తున్న సమయంలో పిల్లలు చూపించే ఉత్సుకతకు సమాధానమివ్వడానికి ముందే నిర్వచించిన పాఠ్యాంశాలు అది కూడా ఆన్లైన్లో సరిపోదని ప్రియా అంటుంది. ''పిల్లలకు వారి చుట్టూ ఉన్న విషయాల గురించి చాలా ప్రశ్నలు పుడతాయి. నేను ఇంట్లో చిన్న చిన్న కార్యకలాపాలతో ప్రయోగాలు చేయడం ప్రారంభించాను. ఇది ఆమెను మరింత ఆసక్తిగా, మరింత ప్రశ్నించేలా చేసింది'' అని ఆమె అంటుంది.
ఫేస్బుక్ పేజీ ప్రారంభించి
తల్లిదండ్రులైన ప్రియా స్నేహితులు చాలామంది ఈ కార్యకలాపాలు ఉపయోగకరంగా ఉన్నాయని భావించారు. జనవరి 2021లో లాంఛనంగా లెర్నింగ్ డినో (ఇంతకుముందు దీనిని ముమ్మావరల్డ్ అని పిలిచేవారు) ప్రారంభించే ముందు ఆమె ూవaతీఅఱఅస్త్ర ణఱఅశీ పేరుతో ఫేస్బుక్ పేజీని ప్రారంభించింది. బెంగుళూరులో ఉన్న లెర్నింగ్ డినో పిల్లల కోసం అభ్యాస సామగ్రిని డిజైన్ చేస్తుంది. రెండు నుండి ఆరు సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలకు విద్యా బొమ్మల కోసం అగ్రిగేటర్ ప్లాట్‌ఫారమ్‌గా కూడా ఇది పనిచేస్తుంది.
మొదటి ప్రయత్నం కాదు
అయితే ప్రియా వ్యవస్థాపకతలో ఇది మొదటి ప్రయత్నం కాదు. మార్కెటింగ్, అడ్వర్టైజింగ్లో దశాబ్దానికి పైగా అనుభవం ఉన్న ఆమె ఇంతకుముందు విష్ అండ్ యు అనే గిఫ్ట్ రిజిస్ట్రీ సైట్‌ను స్థాపించింది. ఇక్కడ వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రధాన ఇకామర్స్ పోర్టల్‌ల నుండి ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేసేవారు.
డినోతో ప్రయాణం
డినో ముఖ్య ఉత్పత్తులు వర్క్షీట్లు, అంతర్గత ఉపాధ్యాయులు, గ్రాఫిక్ డిజైనర్లచే రూపొందించబడిన కార్యకలాపాలు, ప్రియా రూపొందించిన ప్రారంభ ఉత్పత్తులతో సహా దాని సైట్‌కి దాదాపు 90,000 మంది తల్లిదండ్రులను ఆకర్షించడంలో సహాయపడింది. వీటిలో కార్యాచరణ-ఆధారిత వర్క్షీట్లు, లెక్కింపు, రంగుల క్రమబద్ధీకరణ వంటి విభిన్న అంశాలను బోధించే కథనాలు ఉన్నాయి. వీటిని వెబ్సైట్ నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోగలిగినప్పటికీ నేరుగా కొనుగోలు కోసం తల్లిదండ్రుల నుండి వచ్చిన డిమాండ్ కారణంగా వీటిని బండిల్స్‌లో కొనుగోలు చేయడానికి కూడా అందుబాటులో ఉంచారు.
అర్థం చేసుకోవడానికి
''ఏదైనా మార్కెట్‌కి పరిచయం చేయవలసి వచ్చినప్పుడల్లా మేము దానిని ఐదు నుండి ఆరుగురు పిల్లలకు అందిస్తాము. వారు ఎలా ప్రాసెస్ చేస్తున్నారో, వాటికి ప్రతిస్పందిస్తున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. పిల్లలు వర్క్షీట్లను కనీస పర్యవేక్షణతో, ఆనందించగలరని నిర్ధారించుకోవాలనే ఆలోచన ఉంది'' ఆమె వివరిస్తుంది.
నిర్ధిష్ట నైపుణ్యాలు
స్టార్టప్ 40 మంది విక్రేతలకు మార్కెట్‌ప్లేస్‌గా కూడా పనిచేస్తుంది. వీరిలో చాలా మంది తల్లులు వ్యవస్థాపకతని చేపట్టారు. నంబరింగ్, ఫోనిక్స్ కాన్సెప్ట్‌లు, ఐ-హ్యాండ్ కోఆర్డినేషన్ వంటి నిర్దిష్ట నైపుణ్యాలను అందించడానికి విద్యా బొమ్మలు కచ్చితంగా ఎంపిక చేయబడ్డాయి. అంతర్గత ఉత్పత్తుల ధర రూ. 500 నుండి రూ. 1,000 మధ్యలో ఉండగా, థర్డ్- పార్టీ విక్రేతల నుండి పొందిన ఇతర ఉత్పత్తులు - ముఖ్యంగా మాంటిస్సోరి ఉత్పత్తులు - రూ. 10,000 వరకు పెరుగుతాయి.
20 వాట్సాప్ గ్రూపులు
ప్రియా యువ బ్రాండ్‌ను పెంపొందించుకుంటూ తల్లిదండ్రుల సంఘాన్ని నిర్మించడానికి కూడా ప్రాధాన్యత ఇస్తోంది. ప్రస్తుతం ఆమె ఫేస్బుక్లో మొత్తం 4,000 మంది తల్లిదండ్రులతో, 5,300 మంది తల్లిదండ్రులతో సుమారు 20 వాట్సాప్ గ్రూపులను నిర్వహిస్తోంది. ''ప్రతిరోజూ ఉదయం మేము పిల్లల విద్య, ఆరోగ్యం, శ్రేయసు గురించి తల్లిదండ్రులతో కంటెంట్‌ను పంచుకుంటాము'' అని ఆమె చెప్పింది. రూ. 1 లక్ష ప్రారంభ పెట్టుబడితో ప్రారంభించబడిన లెర్నింగ్ డినో ఇప్పుడు రూ. 1.5 లక్షల నెలవారీ స్థూల వ్యాపార విలువని చూస్తోంది.
ఎదురైన సవాళ్లు
ఇది ప్రారంభించడమే సవాళ్లతో వచ్చింది. ఇకామర్స్ స్పేస్‌ను నావిగేట్ చేస్తున్నప్పుడు ఆమె సాంకేతిక నేపథ్యం నుండి రాకపోవడం మొదటి అడ్డంకిని ఎదుర్కొంది. ''సైట్ స్థానాల పరంగా, తల్లిదండ్రులతో ఎలా కమ్యూనికేట్ చేయాలి అనేది కూడా చాలా కష్టమైన పని. కానీ మేము దానిని బాగా చేసాము'' అని ఆమె చెప్పింది. పరిమిత నిధులు, వనరులతో ఉద్వేగభరితమైన బృందాన్ని నిర్మించడం అతిపెద్ద సవాళ్లలో ఒకటి.
ఎంతో మంది ప్రశ్నించారు
ఆమె కొడుకు తొమ్మిది నెలల వయసులో ఉన్నప్పుడు రిస్క్ తీసుకొని వెంచర్ ప్రారంభించలనుకున్నపుడు ఎంతో మంది ఆమెను ప్రశ్నించారు. మహమ్మారి సమయంలో ఇంటి పని, తన పిల్లలను చూసుకోవడంలో సవాళ్లు ఉన్నప్పటికీ ప్రియా లెర్నింగ్ డినోను నిర్మించింది. అయితే ఆమె చెప్పింది.. గొప్ప సలహాదారుల మద్దతును కలిగి ఉండటం పెద్ద మార్పును తీసుకొస్తుంది.
విజయవంతంగా ఉండండి
ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు ఆమె సలహా ఇస్తూ ''ఆలోచన కొత్తదైనా పర్వాలేదు దానికి మార్కెట్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు. మీరు త్వరగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే చాలు. మీ స్టార్టప్ విజయవంతం కాకపోయినా మీరు విజయవంతంగా ఉండండి. అది మీకు, మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు శక్తినిస్తుంది'' అంటుంది.