Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేసవిలో చెమట పట్టగానే చర్మంపై మొటిమల రూపంలో ఉండిపోతాయి. చర్మంపై చెమట పట్టడం వల్ల ఈ సమస్య వస్తుంది. సాధారణంగా వేసవిలో ముఖ్యంగా తేమతో కూడిన వాతావరణంలో ఈ సమస్యతో ఎక్కువగా బాధపడతారు. కొన్ని రోజుల తర్వాత ప్రిక్లీ హీట్ ఆటోమెటిగ్గా అదృశ్యమవుతుంది. కానీ కొన్నిసార్లు ఇది చర్మంపై చాలా పెరుగుతుంది. దీని వల్ల కలిగే దురద, మంట మిమ్మల్ని పరిమితికి మించి ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తుంది. పైగా,మార్కెట్లో లభించే ప్రీ-హీటెడ్ పౌడర్‌ను ఉపయోగించడం వల్ల చర్మ రంధ్రాలు మరింతగా బ్లాక్ అవుతాయి. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. చర్మంపై ఐస్ రుద్దడం లేదా చర్మాన్ని వీలైనంత చల్లగా, పొడిగా ఉంచడం ద్వారా చెమట తగ్గుతుంది. అలాగే దీనికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం...
పచ్చి మామిడి: పచ్చి మామిడికాయ సహాయంతో చర్మాన్ని వేడి నుండి కాపాడుకోవచ్చు. చెమటకాయలను తగ్గించవచ్చు. దానికోసం మొదట మామిడి కాయను గ్యాస్‌పై కాల్చండి. చల్లారగానే గుజ్జును తీసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇప్పుడు అది చల్లారిన తర్వాత దాని గుజ్జును శరీరానికి పట్టించాలి.
కీరదోసకాయ: ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం వేసి సన్నగా తరిగిన కీరదోసకాయ ముక్కలను వేయాలి. ఇప్పుడు ఈ ముక్కలను చెమట పట్టిన భాగాలపై మెత్తగా రుద్దండి.
కొబ్బరి నూనె: కొబ్బరి నూనెలో కొద్దిగా కర్పూరం మిక్స్ చేసి ఈ నూనెతో శరీరమంతా మసాజ్ చేయండి. దీని వల్ల వేడి, చెమట నుండి ఉపశమనం అందిస్తుంది.
వేప ఆకులు: వేప ఆకులను లీటరు నీటిలో వేసి మరిగించాలి. ఈ నీటిని స్నానపు నీటిలో కలుపుకుని ప్రతిరోజూ తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా వేసవి వల్ల కలిగే చెమట కాయలను తక్షణమే తగ్గించుకోవచ్చు.
తులసి: కొద్దిగా తులసి ఆకులను గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను చెమట పట్టిన ప్రదేశంలో రాయండి. దీనివల్ల కూడా మంచి ఉపశమనం కలుగుతుంది.
బేకింగ్ సోడా: రెండు టీస్పూన్ల బేకింగ్ సోడా తీసుకుని ఒక కప్పు నీళ్లలో మిక్స్ చేసి శరీరంలోని ప్రభావిత భాగానికి అప్లై చేయాలి. కొంత సమయం తర్వాత శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోండి. చెమటకాయల బాధ నుంచి విముక్తి పొందవచ్చు.
అలోవెరా జెల్: తీసుకుని చెమట పట్టిన ప్రదేశంలో అలోవెరా జెల్ రాయండి. దీనివల్ల చెమటలు తగ్గుతాయి.