Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పడుకునేటప్పుడు మరీ ఎక్కువ నీరు తాగకండి. ఎక్కువ తాగితే నిద్రపోయిన 4 గంటల్లో బ్లాడర్ నిండిపోయి మెలకువ వచ్చేస్తుంది.
- పడుకునే 2 గంటల ముందే పడకపై ఉన్న దుప్పట్లను బయట ఆరబెట్టండి. దాంతో బయటి గాలి వాటిని చేరి వేడి లేకుండా ఉంటాయి.
సాయంత్రం తడి గుడ్డతో ఇల్లంతా తుడిచేయండి. దాంతో నేలలో వేడి కొంతైనా తగ్గుతుంది. తుడిచాక ఫ్యాన్ లేదా ఏసీ వెయ్యండి. దాంతో రూంలో చల్లదనం వస్తుంది. పిల్లలు ఉన్న ఇంట్లో ఇలా చెయ్యడం ద్వారా పిల్లల ఆరోగ్యం కాపాడినట్లవుతుంది.
- ఇంటి బయట చెట్లు, ఇంటిలోపల నీడలో పెరిగే మొక్కల్ని పెంచుకోవాలి. బయట ఉండే చెట్లు ఇంటిపై ఎండ ఎక్కువ పడకుండా చేసి చల్లదనం ఇస్తాయి. లోపల ఉన్న మొక్కలు లోపలి వేడిని పీల్చుకొని ఉక్కపోత లేకుండా చేస్తాయి.
- పడుకునే సమయంలో మొబైల్‌ను దూరంగా ఉంచండి. రోజూ టైమ్ ప్రకారం పడుకోవడం అలవాటు చేసుకోండి.
- కొంతమందికి ఏ పుస్తకమో చదివితే తప్ప నిద్రరాదు. అలాంటి అలవాటు ఉంటే... మంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే పుస్తకాలు చదవడం మేలు.
పడుకునే సమయంలో ఎక్కువ కాంతి లేకపోతే నిద్ర బాగా పడుతుంది. పూర్తిగా లైట్ లేకుండా పడుకోవడం ఇంకా మంచిది. లైట్ ఉంటే దాని నుంచి కూడా వేడి వస్తుంది.