Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ సంవత్సరం మార్చిలోనే ఎండ ప్రభావాన్ని చూస్తున్నాం. దీంతో వేడిగాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే చిన్నారులు ఎండ ప్రభావానికి గురవుతున్నారు. మండే ఎండలు పిల్లల డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. ఈ వేడిలో పిల్లలను చల్లగా ఉంచేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
పుచ్చకాయ: మనందరికీ తెలిసిందే పుచ్చకాయలో 90 శాతానికి పైగా నీరు ఉంటుంది. వేసవి వచ్చిందంటే చాలు.. మార్కెట్లలో కూడా చాలా స్టాల్స్ అందుబాటులో ఉంటాయి. ఇది మనల్ని హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహాయపడే జ్యుసి పండ్లలో ఒకటి. పుచ్చకాయలో సిట్రులిన్ అనే అమినో యాసిడ్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ముఖ్యమైన అమైనో ఆమ్లం. దీంతో మన గుండె, రోగనిరోధక శక్తికి మేలు చేస్తుంది.
మజ్జిగ: చల్లా లేదా మజ్జిగ హైడ్రేటెడ్‌గా ఉండటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. అందుకే పిల్లలకు తప్పకుండా ఇవ్వాలి.
నిమ్మరసం: నిమ్మ, నీరు, చక్కెర, ఉప్పుతో నిమ్మరసం తయారుచేస్తారు. నిమ్మలో విటమిన్ సి, బి6, పొటాషియం వంటి అనేక ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
మామిడికాయలు: మామిడి పండ్లలో 80 శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది. వేసవిలో ఇది సరైన ఆహారం. పిల్లలకు మామిడి పండ్లను మ్యాంగో స్మూతీస్ రూపంలో కూడా ఇవ్వవచ్చు.