Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేసవి కాలం ప్రారంభం కాగానే చాలా మంది ఆకలితో ఉన్నప్పటికీ ఆహారం తినాలనిపించదు. దీని వల్ల శరీరంలోని శక్తి ఒక్కోసారి తగ్గిపోతుంది. అది అలసటకు దారి తీస్తుంది. అలాగే సమస్యలు కూడా మొదలవుతాయి. అందుకే వేసవిలో శరీరంలో శక్తి స్థాయిని పెంచడంలో కొన్ని ఆహారపదార్థాలు మనకు సహాయపడతాయి. అవేంటో చూద్దాం...
- పుచ్చకాయ తినడానికి రుచిగా ఉండటమే కాకుండా కడుపు నింపుతుంది. అంతే కాదు పుచ్చకాయలో ఎక్కువ మొత్తంలో ఎలక్ట్రోలైట్స్ ఉండటం వల్ల, ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఎనర్జీ స్థాయిని కూడా పెంచుతుంది.
- పొటాషియం, విటమిన్ బి, ఫైబర్ సమృద్ధిగా ఉండే అరటి మీకు తక్షణ శక్తిని అందించడంలో కూడా సహాయపడుతుంది. ఇది మీకు అలసట కలిగించదు. దీనితో పాటు ఇది తినడం వల్ల కడుపు కూడా చాలా నిండినట్టు అనిపిస్తుంది. అలసటను పొగొట్టడంలో ఉత్తమమైనది.
- పెరుగు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వేడి నుండి ఉపశమనం ఇవ్వడం మాత్రమే కాదు. మీ శక్తి స్థాయిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. దీన్ని తినడం వల్ల పొట్ట కూడా ఆరోగ్యంగా ఉంటుంది.అలసటను కూడా తక్షణమే పోగొడుతుంది.