Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేసవిలో విరివిగా దొరికేవాటిలో తాటి ముంజులు ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లో లభ్యమయ్యే ఈ ముంజులకు పట్టణాల్లో డిమాండ్ ఉంది. అందుకు కారణం తెలిస్తే వాటిని ఎవరూ విడిచిపెట్టారు. ఈ ముంజులతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మండు వేసవిలో మాత్రమే లభించే ఈ తాటి ముంజులన ఐస్ యాపిల్స్ అని కూడా అంటారు.
- తాటిముంజుల్లో తక్కువ మొత్తంలో క్యాలరీలు ఉండి అధిక మొత్తంలో శరీరానికి కావాల్సిన శక్తినిస్తాయి. కేవలం వేసవి తాపం నుంచి ఉపశమనాన్ని ఇవ్వడమే కాదు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరంపై వచ్చే చిన్నచిన్న మెటిమలను నివారించడంలో ఉపకరిస్తాయి.
- దీంతో పాటు శరీరానికి మినరల్స్, కార్బోహైడ్రేట్స్‌తో పాటు షుగర్ కంటెంట్ తక్కువగా ఉన్న ముంజులను ఏ వయసు వారైనా తొనవచ్చు. ఇవి డీహైడ్రేషన్ నుంచి కాపాడతాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి తాటి ముంజులను సేకరించే రైతులు నగరాలకు తరలించి వాటిని విక్రయిస్తున్నారు.
- తెల్లవారు జామునే తాటిచెట్ల నుంచి ముంజులను సేకరించి సమీపంలో ఉండే పట్టణాలకు తీసుకెళ్లి అమ్ముతూ ఉంటారు. కేవలం వేసవిలో మూడు నెలలు మాత్రమే పరిమితంగా లభించే వీటిని విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు కొందరు రైతు కూలీలు. డజన్ తాటి ముంజులు 40 రూపాయిల నుంచి 50 రూపాయిల వరకు రేటు పలుకుతోంది.
- కేవలం పల్లెల్లో మాత్రమే కనిపించే ముంజులు నగరాలు, పట్టణాల్లో విరివిగా లభించడంతో నగర వాసులు మంజుల కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఐస్ యాపిల్స్‌గా పిలవబడే ఇవి మెట్ట ప్రాంతాలైన గ్రామాల నుంచి సేకరిస్తున్నారు వ్యాపారులు. వ్యవసాయ పనులు తక్కువగా ఉండే వేసవిలో తాటి ముంజుల విక్రయాలు కాస్తంత ఊరటనిస్తుందని అంటున్నారు. మరి ఆరోగ్యానికి చాలా మేలు చేసే తాటి మంజులను తింటూ ఈ సమ్మర్‌ను ఎంజారు చేయండి.