Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎండలేమో బాగా మండిపోతున్నాయి. బయట తిరిగితే ముఖంలో కాంతి తగ్గిపోతుంది. మచ్చలు వస్తుంటాయి. వీలైనంత వరకు అందంగా తయారవ్వాలని ఆకర్షణీయంగా కనిపించాలని అనుకుంటుంటారు. అయితే చాలా మంది ఎంత అందంగా ఉన్నప్పటికీ ముఖంపై నల్ల మచ్చలతో ఇబ్బంది పడుతుంటారు. కానీ ముఖంపై ఈ నల్లటి మచ్చల వలన చాలామంది మానసికంగా చాలా కుంగిపోతుంటారు. ఎలా ఈ నల్లమచ్చలను పోగొట్టి అందంగా కనిపించాలి అని ఆలోచిస్తుంటారు. మీరు వాటిని వదిలించుకోవడానికి సులభమైన గృహోపకరణాలను ఉపయోగించవచ్చు. వాటిని ఇక్కడ చూడండి.
- బ్లాక్ హెడ్స్‌ను పోగొట్టుకోవడానికి స్క్రబ్ చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా షుగర్ స్క్రబ్ ఎంతో సహాయపడుతుందని ఆచరణలో నిరూపించబడింది. దీని కోసం చక్కెరను కొబ్బరి నూనెతో కలపండి. ఇప్పుడు ఆ మిశ్రమంతో చేతులతో ముఖాన్ని స్క్రబ్ చేయండి. వారానికి ఒకసారి వాడితే చాలా తేడా కనిపిస్తుంది. కొబ్బరి నూనెకు బదులుగా జోజోబా నూనెను కూడా ఉపయోగించవచ్చు.
- దాల్చిన చెక్క పొడి కూడా నల్ల మచ్చలను వదిలించుకోవడానికి ఉపయోగపడుతుంది. స్క్రబ్ చేయడానికి దాల్చిన చెక్క పొడిలో కొన్ని నిమ్మకాయ చుక్కలను వేసి కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి కనీసం 10-15 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత సున్నితంగా మర్దనా చేసి దాన్ని తొలగించండి. ఇది బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్‌ను తొలగించడమే కాకుండా చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది.
- పాలలో తేనె కలపండి. దీని కోసం వెచ్చని పాలను కూడా ఉపయోగించవచ్చు. పాలు చల్లబడిన తర్వాత ముఖాన్ని కడిగి మిశ్రమాన్ని సున్నితంగా మర్దనా చేయండి. కనీసం 10-15 నిమిషాలు అలాగే ఉంచి ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.