Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అధిక బరువు మనిషికి మన: శాంతిని దూరం చేస్తుంది. వేళకు తినకపోవడం, సమయానికి నిద్ర పోకపోవడం వంటివి బరువు పెరగడానికి కారణాలవుతాయి. అయితే ఈ అధిక బరువు శారీరక రోగాలకు దారి తీస్తాయి. అందుకే తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ కొంతమందికి ఆ సమయం కూడా ఉండదు. బరువు తగ్గడానికి కడుపు కాల్చుకుంటారు. అయినా కూడా బరువు తగ్గరు. అలాంటి వారు కొన్నిచిట్కాలు పాటిస్తే బరువు తగ్గుతారు.
బ్రేక్ ఫాస్ట్ తీసుకునేవారి కంటే వేగంగా బరువు పెరుగుతారట. బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల శరీర మెటబాలిజం నెమ్మదిస్తుంది. అంతేకాదు ఆకలి ఎక్కువగా వేయడం వల్ల మధ్యాహ్నం సమయంలో భోజనం ఎక్కువగా తినేస్తారు. ఇది కూడా బరువు పెరగడానికి కారణమే. అందుకే బరువు తగ్గాలనుకునే వారు తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ చేయాలి.
- ఎక్కువ నీరు తీసుకోండి. భోజనానికి ముందు ఒక గ్లాసు నీరు తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. ఇది దీర్ఘకాలికంగా చాలా ప్రయోజనం.
- ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో పది గ్రాముల తేనెతో వేడి నీటిని కలిపి తాగడం అలవాటు చేసుకోండి.
- కూరగాయల సూప్ తయారు చేసి దానికి నల్ల మిరియాలు జోడించండి. దీంతో సూప్ రుచికరంగా ఉండటమే కాకుండా అదనపు కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది.