Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేసవిలోని ఈ వేడి వాతావరణంలో చెమట, దుమ్ము, ధూళి కారణంగా జుట్టు త్వరగా మురికవుతుంది. దాంతో అనేక జుట్టు సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి వేసవిలో జుట్టు సంరక్షణకు కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి.
200 ఎంఎల్ కొబ్బరి నూనెతో 4-5 కరివేపాకులను ఉడకబెట్టండి. చల్లార్చి వడపోసిన తర్వాత సీసాలో పోసి భద్రపరుచుకోవాలి. ఈ నూనెను వారానికి కనీసం 3 సార్లు ఉపయోగించండి.
ఉల్లిగడ్డను దంచి రసం పిండాలి. దీన్ని తలకు పట్టించి 40 నిమిషాలు వేచి ఉండండి. తర్వాత షాంపూతో తల స్నానం చేయాలి. ఇలా వారానికి 1 నుండి 2 సార్లు చేయండి.
తాజా ఉసిరి రసాన్ని తలకు పట్టించి అరగంట పాటు వేచి ఉండండి. తర్వాత తలస్నానం చేయండి.
గ్రీన్ టీ బ్యాగ్‌ను గోరువెచ్చని నీటిలో 2-3 గంటలు నానబెట్టండి. మిశ్రమాన్ని చల్లార్చి తలకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి.
ఒక కప్పు మెంతులను రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు మిశ్రమాన్ని చూర్ణం చేసి నెత్తికి పట్టించండి. దీన్ని జుట్టుకు పట్టించి అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయండి.