Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంట్లోని బాత్రూమ్, వంటగది, వాష్ బేసిన్లు కూడా మెరుస్తూ కనిపించినప్పుడు ఇంటి శుభ్రంగా ఉన్నట్టు. నిజానికి మనం ఉదయం నిద్రలేచిన వెంటనే వాటిని ఉపయోగించడం ప్రారంభిస్తాము. బ్రష్ చేయడానికి, ముఖం శుభ్రం చేయడానికి లేదా తిన్న తర్వాత కడుక్కోవడానికి వాష్ బేసిన్ని ఉపయోగిస్తాము. అలాంటప్పుడు వాటిపై సాధారణంగా సబ్బు మరకలు ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే మురికి పేరుకుపోతుంది. మొండిగా తయారయిన తర్వాత వాటిని శుభ్రం చేయడం చాలా కష్టం అవుతుంది. ఇది మాత్రమే కాదు హార్డ్ వాటర్ సప్లై వచ్చే ఇళ్లలో కూడా సింక్‌లో మరకలు త్వరగా కనిపిస్తాయి. కాబట్టి వాష్ బేసిన్‌పై పేరుకుపోయిన మురికిని ఎలా సులభంగా శుభ్రం చేయవచ్చో తెలుసుకుందాం.
బేకింగ్ సోడా, వెనిగర్: బేకింగ్ సోడా క్లీనింగ్ ఏజెంట్. దీని సహాయంతో సింక్‌ను సులభంగా శుభ్రం చేయవచ్చు. వాష్ బేసిన్ శుభ్రం చేయడానికి ఒక గిన్నెలో బేకింగ్ సోడా, వెనిగర్‌ను పేస్ట్ చేసి స్పాంజ్ సహాయంతో వాష్ బేసిన్‌పై అప్లై చేయండి. దాదాపు 15 నిమిషాల తర్వాత వాష్ బేసిన్‌ను స్క్రాచ్ కాని స్పాంజితో రుద్ది శుభ్రం చేయండి. తర్వాత నీటితో కడగాలి.
వెనిగర్: డిష్ డిటర్జెంట్ ఒక గిన్నెలో వెనిగర్, డిష్ డిటర్జెంట్ తీసుకోండి. ఇప్పుడు స్ప్రే బాటిల్లో వెనిగర్, నీరు, డిష్ డిటర్జెంట్ కలపాలి. ఆ మిశ్రమాన్ని వాష్ బేసిన్ మీద బాగా చిలకరించాలి. సుమారు 15 నిమిషాల తర్వాత మెత్తని స్క్రబ్ బ్రష్‌తో వాష్ బేసిన్‌ను శుభ్రం చేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.
నిమ్మకాయ, బేకింగ్ సోడా: నిమ్మకాయ, బేకింగ్ సోడా సహాయంతో వాష్ బేసిన్‌ను ప్రకాశవంతం చేయవచ్చు. దీనికోసం వాష్ బేసిన్లో బేకింగ్ సోడాను చల్లండి. తర్వాత నిమ్మకాయ తీసుకుని వాష్ బేసిన్ని రుద్దండి. సుమారు 5-7 నిమిషాలు బాగా రుద్దండి. దీని తర్వాత వాష్ బేసిన్‌ను నీటితో శుభ్రం చేయండి. వాష్ బేసిన్‌ను ప్రతిరోజూ శుభ్రంగా ఉంచుకుంటే మొండి మరకలు పేరుకోవు. కాబట్టి ఇంట్లోని వాష్ బేసిన్లన్నింటినీ శుభ్రం చేయడానికి ప్రతిరోజూ కొన్ని నిమిషాలు కేటాయించండి.