Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితం అంటే పూలపాన్పు కాదు. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకుని ముందుకు సాగితేనే సక్సెస్ మన సొంతమవుతుంది. బాధల్నే తలుచుకుంటూ కూర్చుంటే వాటి ప్రభావం కెరీర్‌పై కూడా పడుతుంది. ఉద్యోగం విషయంలోనూ అంతే.. మనకు వ్యక్తిగతంగా ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు.. ఆఫీసుకి కూడా వాటిని మోసుకొస్తే.. అవన్నీ పనిపై ప్రభావం చూపచ్చు. కాబట్టి ఎన్ని వ్యక్తిగత సమస్యలున్నా సరే.. వాటిని ఇంటికి మాత్రమే పరిమితం చేసి.. ఆఫీకుకి వచ్చేటప్పుడు ప్రశాంతమైన మనసుతో వచ్చి మీ పని మీరు సక్రమంగా చేస్తే జీవితంలో పైచేయి మీదే.
ప్రణాళిక ముఖ్యం: కెరీర్లో మనం నిర్దేశించుకున్న లక్ష్యాలను అనుకున్న సమయంలో చేరుకోవాలంటే ప్రణాళిక చాలా ముఖ్యం. కాబట్టి ఎన్ని సమస్యలెదురైనా వాటిని పక్కనపెట్టి ప్రణాళిక ప్రకారం ఫాలో అయితే విజయం మీదే అవుతుంది.
నియంత్రించుకోండి: వ్యక్తిగత సమస్యలున్నప్పుడు కోపం రావడం సహజం. కానీ ఈ కోపాన్ని అదుపులో ఉంచుకుని పని చేస్తేనే కెరీర్‌కి ఎలాంటి ముప్పూ రాదు. అంతేకానీ మీ కోపాన్ని సహోద్యోగులపై చూపిస్తే ఆ ప్రభావం మీ జాబ్, కెరీర్‌పై పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కోపాన్ని నియంత్రించుకుని ముందుకు సాగండి.
ఓపికతో: మన చుట్టూ మనల్ని ప్రోత్సహించే వారికంటే నిరుత్సాహపరిచే వాళ్లే ఎక్కువగా ఉంటారు. అలాగే మనకేవైనా వ్యక్తిగత సమస్యలుంటే వాటిని పంచుకునే వారికంటే దెప్పిపొడిచే వాళ్లే మన చుట్టూ ఎక్కువగా ఉంటారు. కాబట్టి మనకు చాలా దగ్గరగా అనిపించిన సహోద్యోగులకు తప్ప వేరే వాళ్లందరికీ ఈ విషయాలన్నీ చెప్పకపోవడం మంచిది. ఎవరైనా మీ విషయాలన్నీ తెలిసి మిమ్మల్ని హేళన చేస్తే వారితో గొడవకు దిగకుండా నిశ్శబ్దంగా ఉండండి. దీంతో మీ వ్యక్తిత్వం దెబ్బతినకుండా ఉంటుంది. అలాగే కొన్నాళ్లకు వాళ్లే మీ దారిలోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
ధైర్యంగా ముందుకు: బతికినంత కాలం ప్రతిఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఎదురవడం సహజం. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడమా? లేక వెనక్కి తగ్గడమా? అనేది మీ చేతుల్లోనే ఉంది. ఒకవేళ ఎన్ని కష్టాలైనా ఓర్చుకుని ధైర్యంగా ఎదుర్కొంటే జీవితంలో మంచి సక్సెస్ వస్తుంది. లేదంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. దీని ప్రభావం మనం చేసే ఉద్యోగంపై పడే అవకాశమూ ఉంది.
ఒత్తిళ్లలోనూ ఓర్పుగా: ఒక్కోసారి బాస్ ఇచ్చిన వర్క్ మనకు నచ్చకపోయినా, సరైన సమయంలో పూర్తికాకపోయినా ఒత్తిడికి గురవడం సహజం. ఇక దీనికి వ్యక్తిగత సమస్యలు కూడా తోడవుతాయి. ఇలాంటప్పుడు చిరాకు, అసహనం కలుగుతాయి. పనిపై శ్రద్ధ పెట్టలేం. అందుకే అన్ని విషయాల్లోనూ ఓర్పు అనేది చాలా అవసరం.
సలహాలు తీసుకోండి: సమస్యలకు తగిన పరిష్కారాలు మనకు తట్టకపోవచ్చు. మీకు సన్నిహితంగా ఉండే స్నేహితులతో, కొలీగ్స్‌తో మీ సమస్యల్ని చెప్పి తగిన సలహా అడగండి. మీ సమస్య పరిష్కారానికి వాళ్లిచ్చే సలహాలూ ట్రై చేయండి.
వ్యాయామం: సమస్యల ఒత్తిడి తగ్గాలన్నా, పనిమీద ఏకాగ్రత పెరగాలన్నా ఈ రెండింటికీ ఒక్కటే పరిష్కారం. అదే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. దీనివల్ల మనసుకు ఉల్లాసంగా కూడా ఉంటుంది. ప