Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్క్ ఫ్రం హోం కాలం దాదాపుగా పూర్తయింది. కార్యాలయాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. ఉద్యోగులు క్రమం తప్పకుండా ఆఫీసులకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆఫీసు లైఫ్‌లో డైలీ రోటీన్ స్నాక్స్ టైం ఉంటుంది. సరదాగా కొలీగ్స్‌తో కలిపి టీ, స్నాక్స్ అంటూ రోడ్లపై చిరుతిండ్లకు అలవాటు పడతారు. కానీ అవి ఎంత వరకు ఆరోగ్యకరం. కరోనా నేపథ్యంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం.
రోజువారీ స్నాక్స్ ఆఫీస్ లైఫ్‌లో అనివార్యం. ముఖ్యంగా ఇతరులతో కలిసి ఉన్నప్పుడు లేదా ఒత్తిడి తగ్గించుకోవడానికి తప్పకుండా స్నాక్స్‌ని ఆశ్రయిస్తారు. కానీ అనారోగ్యకరమైన చిరుతిండి పూర్తి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అలా అని మీకు ఇష్టమైన స్నాక్స్‌ను వదిలేయాల్సిన అవసరం లేదు. ఆరోగ్యంతోపాటు పరిపూర్ణమైన చిరుతిండిని తీసుకోవడం ముఖం. మీ స్నాక్స్ బాక్స్‌ను మీరే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యంతోపాటు రుచికరంగా కూడా ఉంటుంది.
ముఖ్యంగా మీ ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వండి. మీ ఆహార ప్రణాళికలో అగ్రస్థానంలో ఉన్నారని నిర్ధారించుకోండి. అవసరమైన పోషకాలతో సమయానుకూలమైన చిరుతిండిని ఎంచుకోవాలి. ఆవిరిలో ఉడికించినవాటికి మొదటి ప్రాధాన్యతనివ్వాలి. దోసకాయ, కాటేజ్ చీజ్, టమాట, మొలకెత్తిన గింజలు సలాడ్ వంటివాటిని ఎంచుకోండి. ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంతో ఉడికించిన బ్లాక్ చనా లేదా బీన్స్ కూడా మీ స్నాక్‌లో చేర్చుకోవచ్చు. ఒక బౌల్లో పెరుగు, పచ్చికూరగాయలను సమానంగా తీసుకోవచ్చు. ఇది మరింత ఆరోగ్యకరం, రుచికరం, ప్రోటీన్, కాల్షియం సమృద్ధిగా ఉండాలంటే సెలెరీ, బ్రోకోలీ, టమాట యాడ్ చేయండి.
స్మూథీలు కూడా ఆరోగ్యకరమైనవి. ఇది సులభంగా తయారు చేసుకోవచ్చు. బచ్చలికూర, ఉసిరికాయ, దోసకాయ వంటి తాజా పండ్లు లేదా కూరగాయలను ఎంచుకోండి. అదనపు ప్రోటీన్ కోసం నానబెట్టిన బాదం పప్పులు, ఒకటి లేదా రెండు వాల్ నట్ యాడ్ చేయండి. లేదా ఇతర తేకపాటి స్నాక్స్ ఇడ్లీ, ఓట్స్,ఢోక్లా కూడా మంచివే. భోజనం తర్వాత ఖీర్, కొబ్బరి పాలు, రాగిలడ్డూ వంటి డెజర్ట్ ఎంచుకోండి.
చిప్స్, నామ్ కీన్లు ప్రతిరోజూ అలవాటుగా మారితే మీ ఆరోగ్యంపై ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే ఎంపిక చేసుకోండి. ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే తినండి. అదనంగా, కండర ద్రవ్యరాశి, శక్తిని పెంచడం, జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం వంటి సమతుల్య పోషకహార సప్లిమెంట్‌ను కూడా చేర్చవచ్చు.