Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవిసె గింజల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్-ఇ, విటమిన్-బి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు వంటి పోషకాలు ఈ గింజల్లో లభిస్తాయి. ఇది రక్తపోటు, బరువును తగ్గించడంలో, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఇంకా అనేక ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలకు సహాయపడుతుంది. అయితే అవిసె గింజల్లో ఉండే ఈ పోషకాలు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా జుట్టుకు కూడా మేలు చేసాయంట. ఈ గింజలతో హెయిర్ మాస్క్‌ని తయారు చేసుకోవచ్చు.
అవిసె గింజలను మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో పెరుగు, తేనె, నిమ్మరసం కలిపి చిక్కటి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని జుట్టుకు పట్టించి 20 నిమిషాల తర్వాత షాంపూతో స్నానం చేయాలి. ఈ గింజలతో తీసే ఆయిల్‌తో మీ స్కాల్ప్, హెయిర్‌కి మసాజ్ కూడా చేయవచ్చు. నూనెను నేరుగా జుట్టుకు అప్లై చేయకూడదనుకుంటే దానిని కొబ్బరి నూనెతో కలిపి కూడా ఉపయోగించవచ్చు.