Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మ కడుపులో దాచాలంటే ఆడపిల్లకు కష్టంగా మారింది. ఇక పుట్టాక అడుగు వేస్తే ఆపద. గడియగడియకో గండం. నిమిషానికోసారి తనని తాను చూసుకొని బతికున్నానని నిర్ధారించుకునే పరిస్థితులు. అలాంటి ఆడవారి కోసం ప్రత్యేక చట్టాలున్నాయి. అవేంటో ప్రతి అమ్మాయి తెలుసుకోవాల్సిందే. లైంగిక దాడికి గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారా..? ఒకవేళ నిందితుడు ఏ బడాబాబు కొడుకైతే చిన్నచిన్న సెక్షన్ల ప్రకారం ఏదో ఒక కేసు వేస్తారు. నిందితుడు ఈజీగా తప్పించుకుంటాడు. అలా జరగకుండా ఉండాలంటే ఏ నేరానికి ఏ శిక్ష పడాలి అనేది తెలిసుండాలి.
చదువుకుందామని కాలేజీకి వెళ్తే దారి నిండా కామాంధులే. వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్తే ఒంట్లో ఉన్న రోగాన్ని చూడాల్సిన డాక్టరు ఒంటినే చూస్తున్నాడు. చొరవ తీసుకొని చికిత్స పేరుతో తాకుతాడు. టీచర్, డాక్టర్, స్టూడెంట్, తోటి ఉద్యోగి.. ఇలా ఆడదంటే అందరికీ అలుసైపోయింది. ఆఖరుకు కన్న తండ్రి కూడా కాలయముడై కాటేస్తుంటే స్త్రీకి సమాజంలో రక్షణ ఎక్కడిది? అందుకే మన కోసం ప్రత్యేక చట్టాలు పుట్టాయి. ఏ చట్టం ఏం చెబుతుందో ఏ సందర్భంలో ఎలాంటి చట్టం వర్తిస్తుందో ప్రతి అమ్మాయి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. అప్పుడే తమకు జరిగిన అన్యాయం గురించి గట్టిగా అడగగలుగుతారు. గొంతు విప్పి గర్జించగలుగుతారు.
మహిళల కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెస్తున్నా.. ఆచరణలో సాధ్యం కాని పరిస్థితి. పుట్టక ముందే భ్రూణ హత్యలు. పుట్టిన తర్వాత వివక్షలు. మహిళల జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్నారు. ఆడ పిల్ల అంటేనే ఆర్థిక గుదిబండగా భావిస్తున్నారు. ఆడదానిలో కొందరు విలాస వస్తువును చూస్తున్నారు. మరి కొందరు ప్రేమ పేరుతో వంచన చేస్తున్నారు. మరి ఏ నేరానికి ఏ శిక్ష..?
సెక్షన్ 100: ఆత్మరక్షణకు, ఒక వ్యక్తి మీద దాడి చేస్తే తప్పు లేదు. ఆ సమయంలో సదరు వ్యక్తి చనిపోయినా మీకు శిక్ష పడదు.
166(బి): బాధితురాలికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స ఇవ్వకపోతే సంబంధిత సిబ్బంది, యాజమాన్యం మీద కేసు వయవచ్చు.
సెక్షన్ 228(ఏ): లైంగికదాడికి గురైన మహిళ అనుమతి లేకుండా మీడియాలో ఆమె పేరు, ఫొటోలు ప్రచురించకూడదు. అలా చేసిన పక్షంలో సదరు సంస్థపై చర్యలు తీసుకోవచ్చు
సెక్షన్ 354: స్త్రీ శరీరాన్ని లైంగిక ఉద్దేశంతో చూసినా, తాకినా, అవమానపర్చినా, అనుమతి లేకుండా ఫొటో, వీడియో తీసినా ఈ సెక్షన్ కింద ఫిర్యాదు చేయవచ్చు.
సెక్షన్ 376: వైద్యం కోసం వచ్చిన మహిళను లైంగిక వేధింపులకు గురిచేస్తే వారిపై చర్య తీసుకునేందుకు ఈ సెక్షన్ ఉపయోగపడుతుంది. ఈ సెక్షన్ కింద కేసు చేస్తే రెండు నెలల్లో విచారణ చేసి తీర్పు ఇవ్వాలి. భార్య ఉండగా..
సెక్షన్ 494: మరో పెళ్లి చేసుకుంటే సెక్షన్ ప్రకారం అతని మీద కేసు నమోదు చేయవచ్చు. కేసు రుజువైతే ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది.
సెక్షన్ 498(ఏ): ఓ వివాహితను ఆమె భర్త కానీ, భర్త బంధువులు కానీ శారీరకంగా, మానసికంగా హింసించినా, అందుకు ప్రేరేపించినా.. ప్రోత్సహించినా ఈ సెక్షన్ కింద కేసు వేయవచ్చు. కనీసం మూడేండ్లు జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడుతుంది.
సెక్షన్ 509: మహిళలతో అవమానంగా మాట్లాడినా, సైగలు చేసినా, అసభ్యకర వస్తువులను ప్రదర్శించినా ఈ చట్టం ప్రకారం శిక్షకు అరుÛలు.
సెక్షన్ 294: రోడ్డు మీద నడుస్తుంటే, బస్టాప్‌లో, ఇంకెక్కడైనా ఒంటరిగా ఉన్నప్పుడు అసభ్యకరంగా పాటలు పాడుతూ, శబ్దాలు చేస్తూ ఎవరైనా ఇబ్బంది పెడితే సెక్షన్ 294 ప్రకారం వారిపై ఫిర్యాదు చేయవచ్చు. కనీసం మూడు నెలలకు తగ్గకుండా వారికి జైలుశిక్ష పడుతుంది. లేదా కొంత జరిమానా వేయవచ్చు.