Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంధం- అనుబంధం
ఎన్నో జంటలు చిన్న చిన్న విషయాలకే విడిపోతుంటారు. అలాగని ఒకరిమీద ఒకరికి ప్రేమ ఉండదా అంటే.. ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రేమ ఉంటుంది. మరెందుకు విడిపోతారు. ఎక్కడ లోపం ఉంది.. బంధాలు శాశ్వతంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే... మీ బంధం.. శాశ్వతానుబంధంగా మారాలంటే.. మార్గాలివే...
క్షమించడం: మీ బంధం కలకాలం కొనసాగాలంటే.. మీ మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు వాగ్వాదాల సమయంలో ఎదుటివారిని క్షమించగలగాలి. ఆ సమయంలో వారు అలా ప్రవర్తించారని గుర్తుపెట్టుకుని తరువాతి సమయాల్లో ఎత్తిపొడవకుండా ఉండాలి.
వాస్తవాన్ని అంగీకరించాలి: మీ బంధాన్ని సజీవంగా ఉంచుకోవడానికి వాస్తవాలను అంగీకరించాలి. నేలవిడిచి సాము చేసే ఊహల్లో జీవించకుండా ఉంటే మీ బంధం శాశ్వాతానుబంధంగా.. ఆనందంగా సాగుతుంది.
మంచి శ్రోతగా: మీ భాగస్వామి చెప్పేదాన్ని శ్రద్దగా వినండి. వారు ఏం చెప్పాలనుకుంటున్నారో స్వేచ్ఛగా, నిరభ్యంతరంగా మీ దగ్గర చెప్పుకునేలా వారికి భరోసా ఇవ్వండి. వినండి.
సరదా కబుర్లు: మీకు మీరే ఇద్దరూ కలిసి కొన్ని పనులు చేసుకునేలా నియమం పెట్టుకోండి. అది వంట కావచ్చు, వ్యాయామం కావచ్చు.. టీవీ చూడడం.. సరదాగా సినిమాలకు వెళ్లడం.. అది మీ భాగస్వామితో ఉండేలా చూసుకోండి.
నిజాయితీ: ఎలాంటి పరిస్థితుల్లోనూ మీ భాగస్వామితో నిజాయితీగానే ఉండండి. రహాస్యాలు దాచడం.. అబద్దాలు ఆడడం మంచిది కాదు. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. అప్పుడు మీ బంధం ప్రశ్నార్థకంలో పడుతుంది.
గొడవలు: భాగస్వాముల మధ్య గొడవలు మామూలే. అయితే ఫెయిర్‌గా గొడవపడండి. అతేకానీ తప్పంతా ఎదుటివారిమీద తోసేలా బ్లేమ్ గేమ్ ఆడడం, తెలివిగా తప్పు తనమీద రుద్దాలని చూడడం చేయకండి.
గౌరవించండి: మీ భాగస్వామిని ఎప్పుడూ అవమానించకండి. తగినంత గౌరవం ఇవ్వండి. ఒకరికొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం వల్ల బంధం మరింత బలపడుతుంది.
సహకారం: మీ భాగస్వామి తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు తలపెట్టే కార్యాలు, చేసే ఎంపికల్లో మీ పూర్తి సహకారం అందించండి. వారికి వీలైతే సలహాలు, సూచనలు ఇవ్వండి.
సర్దుకుపోండి: సర్దుకుపోండి.. అనే మాట కాస్త కష్టంగా అనిపించినా.. మీ బంధం శాశ్వతంగా, సంతోషంగా గడవాలంటే కొన్నిసార్లు.. చిన్న చిన్న విషయాల్లో సర్దుకుపోవడమే మంచిది. అదే మీ అనుబంధాన్ని కలకలం ఉండేలా చేస్తుంది.